International

మసీదుపై భారీ ఉగ్ర దాడి.. 100 మందికి పైగా మృతి

ఆఫ్ఘనిస్తాన్ లోని ఈశాన్య ప్రాంత నగరం కుందుజ్ లో శుక్రవారం నాడు భారీ ఉగ్రదాడి జరిగింది. ఓ మసీదులో జరిగిన ఈ పేలుడులో 100 మంది వరకు చనిపోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది. శుక్రవారం నాడు షియా ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగిందని తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మీడియాకు వెల్లడించారు. దీనిపై తాలిబన్ల ప్రత్యేక బృందం ఘటనస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తుందని తెలిపారు. కుందుజ్ లోని ఆసుపత్రులకు తీసుకువస్తున్న క్షతగాత్రుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని వైద్యులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది ఐసిస్-కె (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్)గా భావిస్తున్నారు. షియా ముస్లిం వర్గానికి ఐసిస్-కె ఉగ్రవాద సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. కొద్దిరోజుల కిందట కాబూల్ ఎయిర్ పోర్టులో కూడా వీరే దాడికి పాల్పడ్డారు. “ఈ మధ్యాహ్నం, కుందుజ్ ప్రావిన్స్ లోని ఖాన్ అబాద్ జిల్లాలోని షియా మసీదులో పేలుడు సంభవించింది, దాని ఫలితంగా మా దేశస్థులు అమరులయ్యారు మరియు గాయపడ్డారు” అని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు.

దాడి జ‌రిగిన స‌మ‌యంలో మ‌సీదులో వంద‌ల మంది ముస్లింలు ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో క్ష‌త‌గాత్రుల‌తో కుందుజ్ సెంట్ర‌ల్ ఆస్ప‌త్రి కిక్కిరిసిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో త‌మ ఆస్ప‌త్రికి చాలా మృత‌దేహాలు తీసుకువ‌చ్చార‌ని, గాయ‌ప‌డిన వారికి చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఇక ఇత‌ర ఆస్పత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతులు, క్ష‌త‌గాత్రుల బంధువుల రోద‌న‌ల‌తో కుందుజ్ ప్రాంతంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

కుందుజ్ లో జరిగిన ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఎవరూ చెప్పలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్ షియా ముస్లిం మైనారిటీపై దాడి చేసిన సుదీర్ఘ చరిత్ర ఉంది. వాళ్లే దీనికి పాల్పడినట్లు భావిస్తూ ఉన్నారు. కుందుజ్ ప్రావిన్స్ డిప్యూటీ పోలీసు చీఫ్ దోస్త్ మొహమ్మద్ ఒబైదా మాట్లాడుతూ మసీదులో ఉన్న చాలా మంది చనిపోయారు.. ఆత్మాహుతి దళ సభ్యుడు మసీదులోని జనంతో కలిసిపోయి ఆత్మాహుతి దాడి చేసి ఉండవచ్చునని అన్నారు. అమెరికా దళాలు వెళ్ళిపోయిన తర్వాత చోటు చేసుకున్న అతి పెద్ద మారణకాండ ఇదేనని అంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉగ్రదాడులు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తూ వస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

19 + 14 =

Back to top button