More

    ఒమిక్రాన్ భయంతో 10 రోజులు లాక్ డౌన్.. అది కూడా సొంతంగా నిర్ణయం తీసుకున్నారు

    ప్రజల్లో ఒమిక్రాన్ భయం మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల దుబాయ్ నుంచి గూడెంకు వచ్చిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఆ ఊరి ప్రజలు అందరూ కలిసి ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రామంలో 10 రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నారు. అధికారులు గ్రామానికి చేరుకుని 64 మంది నమూనాలను సేకరించారు. వీరంతా రోగికి నేరుగా లింక్ చేయబడిన వ్యక్తులు. ప్రస్తుతానికి అతడి తల్లికి కూడా కరోనా సోకింది. వారిలో ఒమిక్రాన్ ఉందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. ఇతర రకాల కంటే Omicron వ్యాప్తి ఎక్కువ కాబట్టి, గ్రామ పంచాయతీ 10 రోజుల లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. ఇప్పుడు గ్రామస్తులందరూ పది రోజుల పాటు ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది.

    తెలంగాణ హైకోర్టులో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి గురించి విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల సందర్భంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు గుమికూడకుండా ఉండేలా చూడాలని.. రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే ప్రవేశించిందని… వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు పండుగలు, సెలెబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది.

    Trending Stories

    Related Stories