హైదరాబాద్‌లో ‘అమ్ము’ గ్రాండ్ ప్రీమియర్‌

0
1062
ammu in hyderabad
ammu in hyderabad

ప్రైమ్ వీడియో తొలి తెలుగు ఒరిజినల్ మూవీ “అమ్ము” ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి మంచి అంచనాలను సృష్టించింది. విపత్కర పరిస్థితుల్లో ఫీనిక్స్‌లా ఎదిగే ఓ మహిళ కథను తెరపైకి తెచ్చే ఈ థ్రిల్లింగ్ స్టోరీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అక్టోబర్ 19న ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ప్రీమియర్ షో ప్రారంభం కానుండడంతో, ఈ చిత్ర తారాగణం, సిబ్బంది హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు అమెజాన్ ఒరిజినల్ మూవీ అమ్మూ ప్రత్యేక స్క్రీనింగ్‌ను ప్రైమ్ వీడియో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని AMB సినిమాస్‌లో ఈ రోజు నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో కార్తీక్ సుబ్బరాజ్,నవీన్ చంద్ర, నిహారిక కొణిదెల,దేవాకట్టా,శరత్ మరార్,రాజ్ కందుకూరి మరియు స్వాతి ఈ ప్రీమియర్ కు హాజరయ్యారు.
అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించారు.ఆమె పోలీసు-భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. “అమ్ము” సహనానికి పరీక్ష ఎదురైన క్షణంలో, తన స్వేచ్ఛను తిరిగి పొందడానికి బాబీసింహా పోషించిన అపరిచిత మిత్రుడి పాత్రతో జతకడుతుంది.
దీనికి కార్తీక్ సుబ్బరాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌ కాగా, చారుకేష్ శేఖర్ రచన, దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ డ్రామా థ్రిల్లర్‌లో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, సింహా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2022 అక్టోబర్ 19 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

14 − 1 =