సనాతన హిందూ సంప్రదాయంలో బీహార్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న జర్మనీ అమ్మాయి

0
1281

ప్రేమకు భాష లేదని అంటూ ఉంటారు. దానిని నిరూపించడానికి ఎన్నో ఉదాహరణలను మనం చూశాము. కొన్ని ప్రేమకథలు మన హృదయాలను ద్రవింపజేస్తాయి, ఇంకొన్ని ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి పెళ్లి గురించే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. జర్మనీకి చెందిన ఒక మహిళ బీహార్‌లోని నవాడాకు చెందిన వ్యక్తిని సనాతన హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

లారిసా బెల్చ్ అనే మహిళ జర్మనీలో పుట్టి పెరిగింది. ఆమె బీహార్‌లోని నవాడకు చెందిన సత్యేంద్ర కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ స్వీడన్‌లో రీసర్చ్ స్టూడెంట్. సత్యేంద్ర చర్మ క్యాన్సర్ పరిశోధనలో ఉండగా, లారిస్సా ప్రోస్టేట్ క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్నారు. వారు 2019 లో కలుసుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ భారతదేశంలో వివాహం చేసుకోవాలనుకున్నారు. లారిస్సా భారతీయ సంస్కృతి, సంప్రాదయాలను గురించి మరింత తెలుసుకోవాలని భావించింది. “నేను భారతదేశంలో నా జీవితాన్ని ఆస్వాదించడానికి వచ్చాను. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు” అని లారిస్సా చెప్పింది. “మా ఇద్దరి సంస్కృతుల మధ్య వ్యత్యాసం ఉంది. నాకు హిందీ అంతగా అర్థం కాదు, కానీ సత్యేంద్ర నాకు అనువదించడానికి సహాయం చేస్తాడు”అని ఆమె తెలిపింది.

సత్యేంద్రను పెళ్లి చేసుకోవడానికి లారిస్సా ప్రత్యేక వీసాపై భారత్‌కు వచ్చింది. ఆమె భారతీయ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనుకుంది. వీసా సమస్యల కారణంగా, ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లిలో భాగం కాలేకపోయారు.. కానీ సత్యేంద్ర కుటుంబం మొత్తం హాజరై పెళ్లిని ఘనంగా నిర్వహించారు. రాజ్‌గిర్‌లోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి జరిగింది.