More

    సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ మంత్రి ఎదురుదాడి..!

    ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటంరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు వెల్లడించిన తర్వాత ఏం చర్యలు తీసుకోగలమని అన్నారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారే తప్ప ఫోన్ ట్యాపింగ్ లను నమ్ముకుని కాదన్నారు. ఎవరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని సజ్జల చెప్పుకొచ్చారు. పదవి రాలేదన్న అసంతృప్తి ఉండడం వేరని, బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వేరని అన్నారు.

    ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలను రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ వేరు.. రికార్డింగ్ వేరు అన్నారు. థర్డ్ పార్టీ రికార్డింగ్ చేస్తే దానికి, ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ మారాలి అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చని, కానీ నిందలు వేసి వెళ్లడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు విశాఖపట్నం వేదిక కాబోతోందన్నారు. మార్చిలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సదస్సులు చాలా కీలకమన్నారు. కొత్త బిల్లు ప్రవేశపెట్టి విశాఖపట్నానికి రాజధానిని తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.

    Trending Stories

    Related Stories