More

    సూర్యకుమార్ వీరవిహారం

    న్యూజిలాండ్‎తో జరుగుతున్న రెండో టీ20లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి వీరవిహారం చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలింగ్‎ను ఊచకొత కోశాడు. టీ20 కెరీర్‎లో రెండో సెంచరీ చేశాడు. కేవలం 49 బంతుల్లో శతకం సాధించాడు. మొత్తంగా 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 రన్స్ చేశాడు. దీంతో న్యూజిలాండ్‎తో మూడు టీ20ల సిరీస్‎లో భాగంగా ఆదివారం మౌంట్ మాంగనుయ్‎లో జరుగుతున్న రెండో మ్యాచ్‎లో భారత్ ప్రత్యర్థికి భారీ టార్గెట్ నిర్దేశించింది. అయితే ఈ జులైలో ఇంగ్లండ్‎పై సూర్యకుమార్ తొలి శతకం సాధించాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఈ ఫార్మాట్ లో రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ ఖాతాలో నాలుగు శతకాలు ఉండగా.. కేఎల్ రాహుల్ రెండు సాధించాడు.

    Trending Stories

    Related Stories