More

    సుప్రీం కోర్డు చేరిన కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారం

    బీజేపీ బయటపెట్టిన కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారం.., ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంతోపాటు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ శైలి అనుమానాస్పదంగా ఉందని.., దీనిపై NIA తో  సమగ్రవిచారణ జరపాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు అయ్యింది.   

    అంతకు ముందు.. బీజేపీయే… తమ పార్టీ పేరుతో నకిలీ టూల్ కిట్ ను రూపొందించిదని కాంగ్రెస్ నాయకుడు ఏఐసీసీ రిసెర్చ్ వింగ్ పర్యవేక్షకుడు రాజీవ్ గౌడ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తోపాటు,  ఆ పార్టీ నేతలైన బి.ఎల్.సంతోష్, సంబిత్ పాత్రా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై చర్యలు తీసుకోవాలని ఆయన ఢిల్లీ పోలీసులను కోరారు.

    అటు కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే.., ఇటు బీజేపీ కూడా అలర్ట్ అయ్యింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా వెంటనే సీన్ లోకి ఎంటర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీయే ఆ టూల్ కిట్ ను రూపొందించిందని మరోసారి పునరుద్ఘటించారు. అభూతకల్పనలతో కూడిన కథనాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు  కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. మోదీ ప్రతిష్ఠకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని సంబిత్ పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే సంబిత్ పాత్ర… టూల్ కిట్ ను రూపొందించిన సౌమ్య వర్మ పేరును బయటపెట్టారు. సదరు సౌమ్య వర్మ ఎవరు? ఆమెకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని రాహుల్ గాంధీ చెబుతారా? కాంగ్రెస్ ఐటీ సెల్ కు సంబంధించిన వార్ రూమ్ సభ్యులు, అలాగే కాంగ్రెస్ రీసెర్చ్ టీమ్ సభ్యులు అంతా కలసి రాహుల్ గాంధీతో దిగిన గ్రూప్ ఫోటోను నిజం కాదంటారా?  సంబిత్ ప్రశ్నించారు.  సంబిత్ బయటపెట్టిన గ్రూప్ ఫోటోలో సౌమ్య వర్మ కూడా ఉన్నారు. దీనిపై రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఏం సమాధానం చెబుతారని సంబిత్ నిలదీశారు.  

    సంబిత్ సౌమ్య వర్మ పేరును బయటపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. మరికొంతమంది నెటిజన్లు సౌమ్య వర్మకు సంబంధించిన విషయాలను వెలుగులోకి తెచ్చారు. కాంగ్రెస్ అనుకూల కథనాలను ప్రచరించే వెబ్ పోర్టల్ గా పేరున్న ది ప్రింట్ కథనాన్ని కొంతమంది పోస్ట్ చేశారు. ఆ పోస్టు ద్వారా కాంగ్రెస్ కు సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పనలో సౌమ్యవర్మ కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.

    మరోవైపు సౌమ్యవర్మ ఎవరో ? తమకు తెలియదు అన్నట్లగా కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న సమయంలోనే..,  ఆ పార్టీ సోషల్ మీడియా వార్ రూమ్ సభ్యురాలైన సంయుక్త బసు మహిళ సరికొత్త ట్వీస్టు ఇచ్చారు. పరోక్షంగా సౌమ్యవర్మ తమ టీమ్ సభ్యురాలేననే విషయం బయటపెట్టారు. ఇది మోదీకి వ్యతిరేకంగా తమ టీమ్ సభ్యులు సాధించిన విజయమని.., దీన్ని చూసి పీఎం మోదీ ఏడుస్తున్నాడని,  ప్రజాస్వామ్యంలో అధికారపక్షంపై విమర్శలు గుప్పించే హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఉంటుందని ఆమె తెలిపారు.

    ఇక సౌమ్యవర్మ కార్యకాలపాల విషయాని వస్తే .., కాంగ్రెస్ పార్టీ రీసెర్చ్ టీమ్ ఇంచార్జ్ గా వ్యవహారిస్తున్న రాజీవ్ గౌడ ఆధ్వర్యంలో ఆమె పని చేస్తున్నారనే విషయం…ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. తన ఆఫీసు అడ్రాస్ కూడా కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడ కార్యాలయంగానే పేర్కొంది సౌమ్య వర్మ.!

    బీజేపీ నేతలు…సౌమ్య వర్మ పేరును బయటపెట్టిన కొద్దిసేపటికే… సౌమ్య వర్మ తన ట్వీటర్ హ్యాండిల్ లోని ఫ్రొఫైల్ పిక్చర్ తోపాటు  తన ఆఫీసు అడ్రస్ ను డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాను ఏ తప్పు చేయకపోతే… సౌమ్య వర్మ ఎందుకు భయపడుతున్నారని, ఎందుకని తన సోషల్ మీడియా అకౌంట్లలోని తన ఫోటోను, ఆఫీసు చిరునామాలను ఎందుకు తొలగించారని కొంతమంది నెటిజన్లు..ఆమె తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

    ఇంకా ఇదే వ్యహారంలో మరికొన్ని విషయాలపై ట్వీటర్ వేదికగా చర్చ జరుగుతోంది. కొవిడ్ సెకండ్ వేవ్ ను ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చాలా పక్కా ప్లాన్ తోనే, తన ఈకో సిస్టమ్ ను బాగా వాడుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఈకో సిస్టమ్ లో అంతర్గతంగా పనిచేసే… సెలబ్రిటీలు, బిజినెస్ మెన్లు, లుటియెన్స్ జర్నలిస్టులు, కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు,  మోదీని తీవ్రంగా వ్యతిరేకించే కొంతమంది ప్రొఫెసర్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులను, ఇంకా ఎన్జీవో సంఘాలు నేతలు , కాంగ్రెస్ యూత్ వింగ్ కార్యకర్తలు, మీడియా, ఇలా అందర్ని కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా వార్ రూమ్ నుంచే అప్రమత్తం చేసిందని అర్థమవుతోంది. వారితో నిత్యం సంభాషిస్తూ ఆ టూల్ కిట్ లో పేర్కొన్న ప్రతి అంశాన్ని రాజకీయం చేసింది కాంగ్రెస్.! పీఎం మోదీ టార్గెట్ గా అనేక విమర్శలు గుప్పించింది. ఈ ప్రచారం దేశ ప్రతిష్ఠకు సైతం భంగం కలిగించేలా ఉన్నా కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ అసలు పట్టించుకోలేదు.!  ప్రజల్లో పీఎం మోదీ పట్ల ఉన్న నమ్మకాన్ని మొదట దెబ్బకొట్టాలి.! మోదీ ప్రతిష్టను వీలైనంత తొందరగా మసక బార్చాలి.! కోవిడ్ తోపాటు, దేశంలో ప్రతి సమస్యకు పీఎం మోదీనే బాధ్యుడిగా చూపేడుతూ దేశ ప్రజల్లో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయాలి!  మొత్తంగా ఈ దేశానికి మోదీ చేసింది ఏమిలేదని..? మోదీ విఫలం అయ్యాడనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఈపనిచేసినట్లుగా తెలుస్తోంది.

    అందుకోసం వివిధ ఆర్గనైజేషన్లలో ఉండే తమకు అనూకులంగా ఉండే ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుందని తెలుస్తోంది. మన తెలుగు మీడియా చానళ్లు సైతం కాంగ్రెస్ ఈకో సిస్టమ్ లో భాగమేనని అవి పెట్టిన హెడ్డింగులే చెబుతున్నాయి.!  ప్రధాని మోదీ వల్లే దేశంలో కరోనా వ్యాపించిందని..,  అచ్చం టూల్ కిట్ లో పేర్కొన్నట్లుగా.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా ఒక ప్రకటన చేశాడు. ఆ వెంటనే నేషనల్ మీడియాతోపాటు మన తెలుగు మీడియా ఆయన చేసిన ప్రకటనకు విశేష ప్రాముఖ్యం కల్పిస్తూ ప్రధాని మోదీ ఓ సూపర్ స్ప్రెడర్ అంటూ హెడ్డింగులు పెట్టాయి.

    అయితే నిజానికి డాక్టర్ నవజ్యోత్ దహియా అనేక వ్యక్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్  సభ్యుడి కంటే కూడా.., కాంగ్రెస్ పార్టీ క్రియశీల సభ్యుడు. పంజాబ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహారిస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో సైతం పోటీ చేశాడనే విషయాన్ని మన సోకాల్డ్ మీడియా చానళ్లు పత్రికలు దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో మనకు అర్థం అవుతుంది.  

    అలాగే అచ్చం టూల్ కిట్ లో పేర్కొన్నట్లుగానే… సోనియా ఫెలిరో అనే మహిళా  మే మొదటి వారంలో… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని కనిపిస్తున్న కరోనా వెరియంట్.. ఇండియన్ వెరియంట్ కాదని.., దానికి తాను మోదీ వెరియంట్ గా పేరు పెడుతున్నానని ఆమె ట్వీట్ చేసింది. ఇలా ట్వీట్ చేసిన సోనియా ఫెలిరో అనే మహిళా… రాహుల్ గాంధీ ఒకప్పటి బిజినెస్ పార్టనర్ భార్య అని తేలింది.

    మొత్తంగా టూల్ కిట్ వ్యహారంపై కాంగ్రెస్ పోలీసు ఫిర్యాదు తర్వాత బీజేపీ కూడా ఒక్కొక్కటిగా బయటపెట్టిన సాక్ష్యాలతో ఆ పార్టీ ఖంగుతిన్నది. చివరకు నిజాన్ని అంగీకరించక తప్పలేదు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కాంగ్రెస్ రీసెర్చ్ టీమ్ ఒక డాక్యుమెంట్ ను పార్టీ కోసం రూపొందించిందని.., ఈ అంశాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలనే దానిపై ఆ డాక్యుమెంట్ లో చర్చించడంతోపాటు కార్యకర్తలకు కొన్ని సూచనలు చేయడం జరిగిందని, ఆ రీసెర్చ్ టీమ్ లో సౌమ్య వర్మ కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాజీవ్ గౌడ్ అంగీకరించాడు. అయితే బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా అది కాంగ్రెస్ టూల్ కిట్ కాదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు.

    ఇటు ఢిల్లీ పోలీసులు… ఈ టూల్ కిట్ రగడపై ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ తర్వాతే మిగిలిన విషయాలు చెబుతామని అంటున్నారు. సుప్రీంలో కూడా పిటిషన్ దాఖలు కావడంతో..ఎన్ఐఏకు ఈ కేసును అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ టూల్ కిట్ రగడా ఇంకా ఎన్నిమలుపులు తీసుకుంటుందో..! వేచి చూడాలి.!   

    Trending Stories

    Related Stories