శ్రీరామజన్మభూమి కోసం హిందువులు జరిపిన పోరాటగాథ – 05

0
1245

అయోధ్యలోని శ్రీరామజన్మభూమిలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా నిధి సమర్పణ్ అభియాన్ జరుగుతున్న ఈ తరుణంలో శ్రీరామజన్మభూమి విముక్తి కోసం హిందువులు సాగించిన పోరాటగాథలను మీ ముందుకు తీసుకువచ్చేందుకు నేషనలిస్ట్ హబ్ శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లను ప్రసారం చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఐదో ఎపిసోడ్ లో కడపటి మొగలులతో హిందువులు జరిపిన పోరాటగాథలను తెలుసుకుందాం.
శ్రీరామజన్మభూమిని ధ్వంసం చేసి…హిందువులను నానాయాతనలకు గురిచేసిన మొగల్ పాలకులు..వారి వారసులు చివరి దశలో అత్యంత దుర్భర జీవితాలను అనుభవించారని చరిత్ర చెబుతోంది. పెద్దలు చేసిన పాపం పిల్లలకు పట్టుకుంటుందనే నానుడి మాదిరిగానే కడపటి మొగలుల జీవితాలు గడిచాయాని చెప్పక తప్పదు. అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు నలుగురు మొగల్ పాలకులు భారత్ ను 151 ఏళ్లు పాలిస్తే…, మొదటి బహదూర్ షా నుంచి రెండో షా ఆలం వరకు 11 మంది కడపటి మొగలులు 100 సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పాలించగలిగారు. కడపటి మొగలులు ఒక్కొక్కరిగా సగటున 10 ఏళ్లు కూడా పరిపాలన చేయలేకపోయారన్నది నిప్పులాంటి నిజం.
1680 నాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన పాలకుడిగా ఔరంగజేబు పేరుగడించాడు. ఉత్తర భారతంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబును… ఇటు దక్షిణపథంలో సమర్థంగా అడ్డుకున్న ఏకైక రాజు ఛత్రపతి శివాజీ.! శివాజీ బ్రతికున్నంత కాలం దక్కన్ లో అడుగు పెట్టేందుకు మాత్రం ఔరంగజేబు గజగజ వణికిపోయాడు. 1680లో ఛత్రపతి శివాజీ స్వర్గస్థుడయ్యాడనే విషయం తెలుసుకున్న తర్వాతనే దక్కను లో అడుగు పెట్టాడు. తన సువిశాల ఇస్లామ్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసినా…, శివాజీ స్థాపించిన హిందూ రాజ్యాన్ని ఇట్టే నాశనం చేస్తానని శపథం చేసి మరి… దక్షిణ భారతానికి బయలుదేరాడు ఔరంగజేబు.! అయితే తన జీవిత కాలంలో తిరిగి మళ్లీ ఆగ్రా కోటలో అడుగు పెట్టలేకపోయాడు ఔరంగజేబు. దక్కన్ కు చేరిన ఔరంగజేబును మరాఠా హిందూ సైన్యం ముప్పుతిప్పలు పెట్టింది. 27 సంవత్సరాలపాటు దక్కన్ ప్రాంతంలో సుదీర్గ పోరాటం చేసిన మరాఠాలను మాత్రం ఔరంగజేబు పూర్తిగా అణిచి వేయలేకపోయాడు. చివరకు 1707లో మహారాష్ట్రాలోనే దిక్కులేనివాడిగా ఔరంగజేబు మరణించాడు.
ఔరంగజేబు…27 ఏళ్లు దక్కన్ లో ఉండిపోవడంతో…, ఇటు ఉత్తర భారతంలో పాలనా కుంటుపడింది. ఆఫ్గానిస్తాన్, పంజాబ్ లలో తిరుగుబాట్లు అధికం అయ్యాయి. రాజపుత్రులు, సిక్కులు, ఇటు దక్కన్ లోని బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. 1707లో ఔరంగజేబు మరణం తర్వాత అతడి ముగ్గురు కుమారుల మధ్య మళ్లీ వారసత్వ యుద్ధం జరిగింది. చివరికి కాబుల్ గవర్నర్ గా ఉన్న మువజ్జం వారసత్వ యుద్ధంలో నెగ్గి…, బహదూర్ షా అనే పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. అప్పటికి అతని వయస్సు 63 సంవత్సరాలు.! శివాజీ రగిలించిన హిందూ పద్ పాదుషా స్ఫూర్తితో…, దేశంలో రోజు రోజుకు బలపడుతున్న హిందూ స్వరాజ్య జ్వాలలను చూసి మొగల్ పాలకుడు మువజ్జం భయపడ్డాడు. సిక్కులతో సంధి చేసుకున్నాడు. ఇటు మేవార్, మార్వార్ హిందూ రాజ్యాల స్వాతంత్ర్యాన్ని గుర్తించాడు. అటు బందేల్ ఖండ్ రాజా ఛత్రసాల్ , జాట్ ల నాయకుడు చూరమాన్ లతో వైర్యానికి స్వస్థి చెప్పి సంధి ఒప్పందాలు చేసుకున్నాడు.
కేవలం ఐదేళ్లు మాత్రమే ఢిల్లీ పాదుషా గా కొనసాగిన మువజ్జం బహదూర్ షా…లాహోర్ లో కొంతకాలం గడిపాడు. షాలీమార్ గార్డెన్స్ కు మరమ్మతులు చేయిస్తూ హఠన్మారణం చెందాడు. ఇతని ఐదేళ్ల పాలనాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం జరగలేదని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. ఇంకా జిజియా పన్నును తొలగించాడని అంటారు. అయితే ఇతని పాలనా కాలంలోనూ బాబ్రీకట్టడంపై యాథాతద స్థితి కొనసాగింది.
అధికారం కోసం మొగలులు ఎంతకైనా తెగిస్తారని మనం వారి గత చరిత్రను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అధికారం కోసం ఔరంగజేబు తన తండ్రిని జైల్లో బంధించాడు. సోదరులను చంపేశాడు. ఇక క్రీ.శ. 1712లో బహదూర్‌షా మరణాంతరం కూడా అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. తమ తండ్రి పార్థివ దేహాన్ని ఖననం చేయడం మరచి…సోదరులు ముగ్గురు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు.ఈ పోరులో చివరకు బహదూర్ షా పెద్ద కుమారుడు జహందర్‌షా వారసత్వ యుద్ధంలో గెలిచాడు.
10 వారాల తర్వాతగాని తమ తండ్రి…బహదూర్‌షా పార్థివ దేహాన్ని ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహించాడు జహందర్ షా!
జహందర్ షా కూడా ఏడాది కాలంపాటే మొగల్ సింహాసనంపైన ఉన్నాడు. వారసత్వ యుద్ధంలో జహందర్ షాకు జుల్ఫికర్ ఖార్ ఖాన్ అనే సేనాని మద్ధుతినిచ్చాడు. ఇతడి కాలంలో తురానీలు, ఇరానీలు, హిందుస్థానీలు అనే మూడు వర్గాలు ఉండేవి. కేవలం 11 నెలలు మాత్రమే పాలకుడిగా ఉన్నాడు. నృత్యకళాకారిణిగా ఉన్న లాల్ కున్వర్ ను ఇతను వివాహం చేసుకుని పట్టపురాణి హోదా కట్టబెట్టాడు. అప్పటికి ఇంకా బ్రతికే ఉన్న ఔరంగజేబు కుమార్తె…జినత్ ఉన్ నిసా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని జహందర్ పట్టించుకోలేదు. లాల్ కున్వర్ కూడా పారిపాలనలో ఆధిపత్యం చెలాయిచడం మొదలు పెట్టింది. ఆమె రక్త సంబంధీకులు కూడా మొగల్ రాజ్యాన్ని భ్రష్టుపట్టించారని చెబుతారు.
1713లో జరిగిన ఆగ్రా యుద్ధంలో తన సోదరుడి కుమారుడు ఫరూక్‌సియార్ చేతిలో.., జహందర్ షా ఓటమి పాలయ్యాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత పారిపోయి ఢిల్లీకి చేరిన ఇతన్ని బంధించి జైలులో వేశాడు కొత్త సుల్తాన్ ఫరూక్‌సియార్..!
1713లో ఢిల్లీ గద్దెనెక్కిన ఫరూక్ సియార్ కు సయ్యద్ సోదరులు అండగా నిలిచారు. ప్రతిఫలంగా సయ్యద్ అబ్దుల్లాఖాన్ ను వజీర్ గా, అతడి తమ్ముడు హుస్సేన్ అలీఖాన్ ను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. జహందర్ షాకు యుద్ధంలో సహకరించిన జూల్ఫికర్ ఖాన్ ను ఫరూక్ సియార్ చంపించాడు. అంతేకాదు సయ్యద్ సోదరులు తమ స్థానంలో మరోకరిని తమ పదవుల్లో నియమించకుండా ఉండేందుకు…బందీలుగా ఉన్న రాజకుమారులందరి కళ్లు తీయించారు. జహందర్ షాను అతని భార్యను కూడా హత్యా చేయించారు. ఆ తర్వాత ఫారూక్ సియార్ పై సయ్యద్ సోదరులు తిరుగుబాటు చేశారు. వారి చేతిలో ఓడిపోయిన మొగల్ పాలకుడు ఫరూక్ సియార్ ను.., సయ్యద్ సోదరులు తీవ్ర హింసలకు గురిచేశారు. 1719లో అతని కళ్లును సూదులతో పోడిపించి గుడ్డివాడిని చేశారు. తర్వాత రెండు నెలలకు అతన్ని గొంతునులిమి చంపేయించారు.
ఇక ఫరూక్ సియార్ స్థానంలో రఫీ ఉద్దరజత్ ను పాలకుడిగా నియమించారు. అయితే ఇతడు కూడా నాలుగు నెలల్లోనే మరణించాడు. అతడి అన్న రఫీ ఉద్దౌలాను రెండో షాజహాన్ పేరుతో సింహానంపై కూర్చోబెట్టారు. ఈ రెండో షాజహాన్ కూడా 1719 సెప్టెంబర్ లో మరణించాడు. అతడి స్థానంలో రౌషాన్ అక్తర్ ను మహమ్మద్ షా అనే బిరుదుతో మొగల్ సింహాసనంపై కూర్చోబెట్టారు.
ఇదే సమయంలో నిజాం ఉల్ ముల్క్, ఇతమద్ ఉద్దౌలా, సాదత్ ఖాన్, మహమ్మద్ షా తల్లి ఒక కూటమిగా ఏర్పడి సయ్యద్ సోదరులను చంపించేందుకు కుట్రలు చేశారు. 1720లో సయ్యద్ హుస్సేన్ అలీఖన్ , అతడి కుమారుడిని దక్కన్ లో చంపించారు. నెల రోజుల తర్వాత అతడి సోదరుడు సయ్యద్ అబ్దుల్లా ఖాన్ ను…, బంధించి విష ప్రయోగంతో హతమార్చారు. సయ్యద్ సోదరుల మరణం తర్వాత మొగల్ సామ్రాజ్య పతనం మరింత వేగవంతం అయ్యింది.
మహమ్మద్‌షా వయసు సింహాసనాన్ని అధిష్టించేనాటికి 18 సంవత్సరాలు మాత్రమే. ఇతడు నిరంతరం రాజప్రసాదం నాలుగు గోడల మధ్య అంతఃపుర స్త్రీల సాంగత్యంలో గడిపాడు. విలాసాలకు బానిస కావడంతో ‘రంగీలా గా పేరుగాంచాడు. ఇతడు మహమ్మద్ అమీన్‌ఖాన్‌ను వజీర్‌గా నియమించాడు. 1721లో అమీన్‌ఖాన్ మరణం తర్వాత ఆ స్థానంలో…, హైదరాబాద్ నిజాం ఉల్‌ముల్క్‌ను వజీర్ గా నియమించాడు. తనదైన సంస్కరణల ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని నిజాముల్ ముల్క్ ప్రయత్నించాడు. అయితే చక్రవర్తియే నిజామ్ కు పరోక్షంగా ఇబ్బందులు కల్పించాడు. దీంతో విసిగిపోయిన నిజాం ఉల్‌ముల్క్ వజీర్ పదవిని వదలిపెట్టి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని 1724లో స్థాపించాడు. అలాగే ముర్షీద్ కులీఖాన్ బెంగాల్‌లో, సాదత్‌ఖాన్ అవధ్‌లో స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. మాల్వా, గుజరాత్‌లు మొగల్ సామ్రాజ్యం నుంచి విడిపోయాయి.
దేశంలో అప్పటికే బలపడిన మరాఠా పెష్వాలు…ముస్లిం నవాబుల చెర నుంచి అయోధ్య, మథుర, కాశీ మందిరాలకు విముక్తిని కల్పించేందుకు తీవ్రంగానే యత్నించారు. వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు. అయితే అప్పటికే దేశ సరిహద్దుల్లో అస్థిర పరిస్థితులు నెలకొనడం వరుస విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు కొనసాగడంతో శ్రీరామజన్మభూమి ఆందోళనలు అయోధ్య ప్రాంతం వరకు పరిమితం అయ్యాయని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. వీరి కాలంలో కూడా తిరుగుబాట్లు జరిగినా హిందూ సమాజం నిర్ణయాత్మక విజయం సాధించలేకపోయింది.
అయోధ్య శ్రీరామజన్మభూమి విముక్తి ఉద్యమం అధ్యయనం చేసేవారు…మొదట రెండు విషయాలను…, స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
ఇస్లాం…మన పవిత్ర భారత దేశంలో పుట్టిన మతం కాదు..! అంతేకాదు మన దేశ ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినా విలువలతో కూడిన మతమూ కాదు.! ఇస్లాం.. జననం మక్కా-మదీనాలో జరిగింది. దాని ఆచార పద్దతులు కూడా అరబ్బు సంస్కృతి, సంప్రదాయాలకు చెందినవే..!
ఇక రెండో విషయం… ఇస్లాం ఒక దురాక్రమణవాద, సామ్రాజ్యవాద శక్తిగా అత్యంత క్రూరత్వంతో మనదేశానికి వచ్చింది. రక్తాన్ని ఏరులైయ్యేలా పారించింది. హిందూ దేవాలయాలను నాశనం చేసింది. ఇస్లాం కత్తికి బలవుతారా లేక మతం మారుతారా ? అంటూ భయపెట్టింది. అనేకమందిని బలవంతంగా మతం మార్చింది..!
అయినా కూడా అనేకమంది సాధుసంతుల నేతృత్వంలో హిందువులు… 1526 నుంచి శ్రీరామజన్మభూమి విముక్తి కోసం నిరంతరం పోరాటం సాగిస్తూనే వచ్చారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here