శ్రీరామజన్మభూమి కోసం హిందువులు జరిపిన పోరాటగాథ – 03

0
1470

అది కామన్ ఏరాకు పూర్వం 100 సంవత్సరాల కిందటి మాట.! అవంతి సామ్రాజ్యాధినేత గంధర్వసేనుడి కుమారుడైన విక్రమాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. దేశంలోకి చొరబడి ప్రజలందరిని నరకయాతనలకు గురిచేస్తోన్నశకులను పారద్రోలాడు. దీంతో ప్రజలు ఆయన్ను శకారి అని పిలిచారు. అంతేకాదు ఆయన పేరుతో విక్రమ శకం కూడా ప్రారంభమైంది. రామయణ కథలు సామ్రాట్ విక్రమాదిత్యుడికి ప్రేరణగా నిలిచాయి. దాంతో త్యాగధనులైన తమ పూర్వీకుల ముఖ్యపట్టణం అయోధ్య నగరం ఎక్కడుందని అన్వేషించాడు సామ్రాట్ విక్రమాదిత్యుడు. అద్భుతమైన శిల్ప సౌదర్యంతో , 84 స్తంభాలతో , ఇంకా దివ్యాలంకారలతో కుశమహారాజు నిర్మించిన మందిరాన్ని మరింతగా విస్తరించాడు విక్రమాదిత్యుడు. దీంతో అయోధ్యనగరం తిరిగి తన పూర్వశోభను సంతరించుకుంది.

విక్రమాదిత్యుని కాలంలో వచ్చిన పాహియాన్ అనే చరిత్రకారుడు కూడా అయోధ్య నగరం గూర్చి గొప్పగా వర్ణించాడు. మహాకవి కాళిదాసు రచించిన విక్రమాదిత్య చరితంలో, పతంజలి మహర్షి రచించిన మహాభాష్యంలో అయోధ్య రామజన్మభూమి గుర్చి వర్ణనలు చేశాడు. అటు సముద్రగుప్త చక్రవర్తి చేసిన శాసనాలలో అయోధ్య నగరం గురించిన ఉల్లేఖనలు ఉన్నాయి. హర్షుని కాలంలో మన దేశానికి వచ్చిన చైనా చరిత్రకారుడు హుయాన్ థ్సాంగ్ కూడా అయోధ్యను సందర్శించాడు. అయోధ్య నగరం ధనధాన్యాలతో తలతూగుతుండేదని పేర్కొన్నాడు. అంతేకాదు ఆర్.ఎన్.దాండేకర్ సచ్చిదానంద్, భట్టాచార్య, స్మిత్ మొదలైన చరిత్రకారులు అయోధ్యను భారత దేశానికి సాంస్కృతిక రాజధానిగా పేర్కొన్నారు. అందుకు శ్రీరామజన్మభూమిలో తవ్వకాల్లో బయట శిల్పఖండాలే సాక్ష్యాలు.!

ఆ తర్వాత కాలంలో
వందల ఏళ్లు గడిచిపోయాయి. పశ్చిమాన పుట్టిన ఇస్లాం… మతం పేరుతో ఒక్కోదేశాన్ని ఆక్రమించసాగింది. ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్నఆయా దేశాల నాగరికతలను, నాశనం చేస్తూ…భారతదేశ వాయువ్య ప్రాంతాలపై వరుసగా దాడులు మొదలు పెట్టింది. హిందూ రాజులు దాదాపు మూడు వందల ఏళ్ళపాటు వీరి దురాక్రమణలను నిలువరించారు.

కామన్ ఏరా.. 1024వ సంవత్సరంలో విదేశీ దురాక్రమణదారుడైన మహమ్మద్ గజనీ గుజరాత్ లోని సోమనాథ్ మందిరాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత 1029లో అతని అల్లుడు సలార్ మసూద్ అనే ముష్కరుడు మరోసారి భారత్ పై యుద్ధానికి వచ్చాడు. 1033లో కోసల రాజ్యంపై దాడికి దిగాడు. అయోధ్యలోని రామమందిరాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ముందుకు కదిలాడు. రాజా సుహేల్ దేవ్, ఆయన పుత్రిక పద్మ కూడా రాజ్య రక్షణకు సిద్ధమయ్యారు. రామజన్మభూమి రక్షించుకోవడానికి ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని మహరాజు సేనాపతి త్రిలోకచంద్ర తదితరులు ప్రతిజ్ఞ చేశారు. సరియూ నది ఒడ్డున పోరు ప్రారంభమైంది. అనేక రోజులపాటు యుద్ధం కొనసాగింది. హిందూ వీరుల శౌర్య పరాక్రమాల ముందు మ్లేచ్చులు నిలువలేకపోయారు. మసూద్ తోపాటు అతని సేనాని ముజఫర్ ఖాన్ కూడా యుద్ధంలో వధించబడ్డాడు. ముస్లిం సైన్యం అంతా సర్వనాశనం అయ్యింది. దేశ సరిహద్దుల అవల వరకు విదేశీ ముష్కరులను తరలిమికొట్డం జరిగింది.

అయితే 1192 లో పృధ్వీరాజ్ చౌహాన్ ఓటమి తర్వాత ఘోరీ, తుగ్లక్, ఖిల్జీ, ఇలా వరుసగా ఢిల్లీ సుల్తాన్ల పాలన ప్రారంభమైంది. అయినా కూడా అయోధ్యలో మాత్రం హిందువులు… శ్రీరామడి జన్మస్థలంలో పూజలు మాత్రం మరువలేదు. కామన్ ఏరా కు పూర్వం 100 సంవత్సరం నుంచి మొదలు పెడితే… కామన్ ఏరా 1528 వరకు కూడా అయోధ్యలోని శ్రీరామజన్మభూమిలోని రామాలయంలో నిత్య పూజలు జరుగుతూనే వచ్చాయి.

అటు 1526 సంవత్సరంలో విదేశీ దురాక్రమణదారుడైన బాబర్ భారత దేశంపై దండేత్తివచ్చాడు. బాబరు…, అతని సైన్యం అంతా ఒక ముష్కర తెగ! తమ ఇస్లాం మతాన్ని విస్తరించాలి…, అన్యమతాలు అంతరించాలనే మనస్తత్వం వారిది.! విగ్రహారాధనను వీరు విశ్వసించరు. తాము స్వాధీనం చేసుకున్న రాజ్యంలో ఎవరూ విగ్రహారాధన చేయరాదంటూ ఫర్మానాలు జారీ చేశారు. అంతేకాదు దేవాలయాలను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. చిత్తోడ్ గఢ్ కు చెందిన రాజపుత్రుడు మహారాణా సంగా…, బాబరును వెనక్కి తరిమేందుకు తీవ్రంగా యత్నించాడు. దాంతో దిక్కుతోచని బాబరు… తన సేనలతో అయోధ్య మీదుగా బీహార్ వైపునకు వెళ్లాలని ఆదేశించాడు.

ఇక బాబరుకు జాలాల్ షా, ఫకీర్ ఫజల్ అబ్చాస్ కలందర్ అనే ఇద్దరు సలహాదారులు ఉండేవారు. వీరు కరుడుగట్టిన ఇస్లామ్ మతోన్మాదులు. విగ్రహ విధ్వంసంక ప్రబోధకులుగా పేరుబడ్డారు. భారత్ లో ఇస్లామ్ చిరకాలంగా స్థిరపడాలంటే, హిందుత్వాన్ని, హిందూ దేవాలయాలను కాలరాచి వేయాలని… వారు నిత్యం బాబర్ ను రెచ్చగొట్టారు. స్వతహాగా… హిందూ వ్యతిరేకి అయిన బాబర్…, కలందర్ బోధనల ప్రభావంతో మరింతగా రెచ్చిపోయాడు. హిందూ దేవాలయాలపై పడ్డాడు.

ముఖ్యంగా హిందువులకు శ్రద్ధకేంద్రంగా నిలిచిన అయోధ్యలోని శ్రీరామజన్మభూమిలోని అతి ప్రాచీన మందిరంపై దాడి చేయాలని తన సేనాని మీర్ బక్షిని ఆదేశించాడు బాబర్. కొంతమంది చరిత్రకారులు ఇతడిని మీర్ బాకీగా కూడా పేర్కొన్నారు.

మరోవైపు విదేశీ దురాక్రమణదాడైన బాబర్ సైన్యం… అయోధ్యలో రామమందిర విధ్వంసానికి వస్తున్నదని ముందే తెలుసుకున్న సాధుసంతులు అప్రమత్తం అయ్యారు. ఆలయ రక్షణ కోసం జపమాలలు వదిలిపెట్టి సాధువులు అందరూ ఆయుధాలను చేత పట్టారు.! విదేశీ బాబర్ ముష్కర మూకతో యుద్ధంలో తలపడ్డారు. యుద్ధం భీకరంగా సాగింది. తలలు తెగిపడుతున్నా కూడా సాధు సంతులు, మిగిలిన హిందూ వీరులు తమ చేతిలోని ఖడ్గాన్ని మాత్రం వదిలి పెట్టకుండా తుది శ్వాస వరకు పోరాడారు. ఈ యుద్ధంలో దాదాపు లక్షా 74 వేల మంది ప్రాణాలు వదిలారని కొంతమంది చరిత్రకారులు చెబుతారు.

కామన్ ఏరాకు ముందే… దాదాపు 100వ సంవత్సరాల క్రితం రాజా విక్రమాదిత్యుడు నిర్మించినా అత్యంత పురాతనమైన రామమందిరాన్ని, బాబర్ పంపిన ముష్కర మూకలు కూల్చివేశాయి. కూల్చివేసిన మందిర స్తంభాలనే ఆసరగా చేసుకుని అదే స్థలంలో మీర్ బాకీ…బాబ్రీకట్టడాన్నినిర్మించాడు.

ఇక ఆనాటి నుంచి ఇప్పటి ఆధునిక యుగం వరకు కూడా హిందువులు…రామమందిరం కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చారు. సాధుసంతుల నాయకత్వంలో 77సార్లకు పైగా హిందూ సమాజం శ్రీరామజన్మభూమి స్వాధీనం కోసం పోరాటం చేసింది. వివిధ కాలాల్లో జరిగిన ఈ పోరాటంలో దాదాపు నాలుగు లక్షల 50 వేల మందికి పైగా హిందువులు వీరమరణం పోందారు.

కొంతమంది మార్క్స్ మేకాలే వాదలు, కుహనా సెక్యులర్ మేధావులు, రచయితలు, చరిత్రకారులు…, బాబర్… భారత్ దేశాన్ని ప్రేమించాడని కట్టుకథలు చెబుతారు. అయితే నిజానికి బాబర్ మన దేశాన్ని ఎన్నడూప్రేమించలేదు. 1530లో ఆగ్రాలో మరణించిన బాబర్…, అంతకు ముందే…, తాను మరణిస్తే… తన మృతదేహాన్ని కాబుల్ కు తరలించి…, అక్కడే ఖననం చేయాలని తన వారసులకు చెప్పిపెట్టాడు.

భారత్ ను… బాబర్ ప్రేమించాడని చెప్పే మార్క్స్ మేకాలేవాద చరిత్రకారులు సూడో సెక్యులర్ వాదులను.., బాబర్… ఎందుకు తన మృతదేహాన్ని భారత్ లోనే ఖననం చేయమని అడగలేదని ప్రశ్నిస్తే నోరు మెదపరు. కాబుల్ లో తన మృతదేహాన్ని ఖననం చేయమని బాబర్ కోరాడంటేనే…అతనికి ఆఫ్గానిస్తాన్ లోని తన రాజ్యంపై ఉన్నమక్కువ ఇట్టే అర్థం అవుతుంది.

నిజానికి బాబర్ జన్మస్థలం ఉజ్బెకిస్తాన్ లోని ఫెర్గానా లోయలోని అందిజాన్ పట్టణం. ఈరోజుకు కూడా ఉజ్బెకిస్తాన్ కు చెందిన చరిత్రకారులు మొగలాయిలను తమ జాతీయ హీరోలుగా పేర్కొంటారు. కానీ మన దేశంలో బానిసమనస్తత్వం కలిగిన కొంతమంది చరిత్రకారులు…దేశంలోని ముస్లింలందరికీ బాబర్ ఆదర్శమంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు.

అయితే బీజేపీ సీనియర్ నేత…బాబర్ కు సంబంధించిన అనేక చారిత్రక అంశాలను బయటపెట్టాడు.
బాబర్ స్వయంగా రాసిన బాబర్ నామాను చదివితే… చాలూ అతను ఎంతటి క్రూరుడో తెలుస్తుందని
అనేక విషయాలను బయటపెట్టి… కుహనా సెక్యులర్ వాదుల నోళ్ళు మూయించాడు. అయోధ్య కేసులో ఇన్ ఫ్లీడ్ పిటిషన్ దాఖలు చేసి… కేసు త్వరగా పరిష్కారం అయ్యేందుకు నాంది పలికాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × two =