శ్రీరామజన్మభూమి కోసం హిందువులు జరిపిన పోరాటగాథ – 02

0
1486

మన దేశంపైకి ఎంతో మంది విదేశీ దురాక్రమణదారులు వచ్చారు. రక్తపుటెరులు పారించారు.
అలా వచ్చినవారిలో మొఘలులు ఒకరు.. వారి తర్వాత నవాబులు వచ్చారు…, కాలగర్భంలో కలిశారు. అనంతరం ఆంగ్లేయులు వచ్చారు. దేశాన్ని ముక్కలు చేసి వెళ్లిపోయారు. స్వాతంత్ర్య భారతం…ఘనమైన ప్రజాస్వామ్య దేశం..! అయినా కూడా రామ మందిర నిర్మాణానికి బాటలు పడలేదు. మన దేశంపై దండయాత్రలు చేసిన గజనీలు, ఘోరీలు…మార్క్స్, మెకాలే , లెఫ్ట్ లిబరల్ వాదుల రూపంలో, కుహనా సెక్యులర్ వాదుల రూపంలో మందిర నిర్మాణానికి అడ్డుతగులుతూ వచ్చారు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయి. భవ్యమైన మందిరం కోసం నిధిసేకరణ్ అభియాన్ జరుగుతున్న తరుణంలో శ్రీరామజన్మభూమి కోసం హిందువులు జరిపిన పోరాటగాథను ఒకసారి మనం మననం చేసుకుందాం!

అయోధ్యలోని సరియూ నది..! ఆ నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తే చాలూ.., త్రేతాయుగం నాటి నుంచి ఇప్పటి వరకు అయోధ్యలో జరిగిన అనేక చారిత్రక సత్యాలు ఒక్కసారిగా మన కళ్లకు సాక్ష్యాత్కరిస్తాయి.!

అయోధ్యా మథురా మాయా, కాశీ కాంచీ అవంతికా!
వైశాలీ ద్వారికా ధ్యేయా పురీ తక్షశిలా గయాః!! అంటారు మన పెద్దలు.

-దేశంలోని మోక్షదాయకమైన నగరాల్లో అయోధ్య ఒకటి..! అంతేకాదు భారత జాతికి ఆరాధ్యదైవమైన ప్రభు శ్రీరామచంద్రుని జన్మస్థలం.! నిజానికి… ప్రాచీన భారత దేశ చరిత్ర అంతా కూడా…
మనువు సంతతి ద్వారా ప్రారంభమైందని…కొంతమంది పరిశోధకులు చెబుతారు.

మనువు పుత్రుల్లో ఇక్ష్వాకువు పెద్దవాడు. మనువు తన సామ్రాజ్యాన్ని పది భాగాలుగా విభజించి.. తన తొమ్మిది మంది పుత్రులకు, పుత్రికకు పంచి ఇచ్చాడు. ఇందులో మధ్య భారత్ ప్రాంతాన్ని ఇక్ష్వాకువుకు ఇచ్చాడు. ఈ మధ్యభారత్ ప్రాంతానికి రాజధాని అయోధ్య నగరం. రుగ్వేదంలో ఇక్షాకువు, మాంధాతల శౌర్య పరాక్రమాల ఉల్లేఖనలు కనిపిస్తాయని పండితులు కూడా ధృవీకరిస్తారు. అయితే కాలక్రమంలో ఇక్ష్యాకువు రాజ్యం… కోసల రాజ్యాంగంగా ప్రసిద్ధిచెందింది.

మహర్షి వాల్మీకి రామాయంణంలో అయోధ్య నగర వైభవాన్ని కడురమ్యంగా వర్ణించారు. ఈ ఇక్ష్వాకువు వంశంలో ప్రభు శ్రీరామచంద్రుడు సర్వ శ్రేష్ఠుడు. ధర్మ రక్షణ కోసం రాక్షస శక్తులపై యుద్ధం చేశాడు. అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత… శ్రీరాముడి మహాభినిష్క్రమణ జరిగింది. ఆ తర్వాత కాలంలో అయోధ్య నగరానికి వరదలు వచ్చాయి. అనంతరం కోసల సామ్రాజ్యానికి కుశావతి రాజధానిగా మారింది. శ్రీరాముడి జేష్ఠ్య పుత్రుడు కుశుడు మహారాజు అయినాడు. శ్రీరాముడి సోదరులు, వారి కుమారులు అంతా కలిసి… భారత దేశం కేంద్రంగా అటు పశ్చిమాన….ఇటు తూర్పు దేశాలను కలుపుతూ బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచమంతటా విస్తరించాయి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం కథా గానంతో దేశమంతటా రామనామం మారుమోగింది.

తూర్పు, పశ్చిమ దేశాల వరకు విస్తరించిన సామ్రాజ్యాన్ని పాలన సౌలభ్యం కోసం విభజించారు. భరతుని పుత్రులు… తక్ష, పుష్కలుడు లకు పశ్చిమ భారత దేశ ప్రాంతాలను అప్పగించాడు. తక్షకుడు తక్షశిలను, అలాగే పుష్కలుడు పుష్కలావతి…నేటి పెషావర్ ను రాజధానిగా చేసుకుని పాలన సాగించారు.
లక్ష్మణుని పుత్రులు… చంద్రకేతు, అంగదులకు మల్లదేశం, కామరూపం ఇవ్వగా…, శత్రుఘ్నని పుత్రులు సుభాహుకు మధురా, శత్రుధాతికి విదిశా రాజ్యాలను కట్టబెట్టారు. వాలి పుత్రుడు అంగదునికి దక్షిణాపథంలోని కిష్కింద, విభీషణునికి లంకాపురిని అప్పగించారు.

లవుడు శారావతి, కుశుడు కుశావతి రాజధానులుగా చేసుకుని రాజ్యాపాలన సాగించారు. శ్రీరాముడి కుమారుడు లవుడి సూచన మేరకు… కుశమహారాజు వరదలతో దెబ్బతిన్న అయోధ్య నగరాన్ని తిరిగి పునర్ నిర్మించి… , ఎక్కడైతే శ్రీరామచంద్రుడు జన్మించాడో… ఆ పవిత్ర స్థలంలో మొదటి సారిగా భవ్యమైన రామమందిరాన్ని నిర్మించాడు. త్రేతాయుగంలోని చివరి పాదం నుంచి కూడా యావత్ సమాజం పరంపరగానుగతంగా శ్రీరామ జన్మభూమిని పూజివచ్చింది.

కుశ మహారాజు తర్వాత అనేక తరాల అనంతరం కోసల దేశానికి దృహదబలుడు రాజు అయినాడు. త్రేతాయుగం పోయి ద్వాపర యుగం వచ్చింది. మహాభారత యుద్ధంలో ఈ దృహదబలుడు కౌరవుల పక్షాన నిలిచాడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడి చేతిలో మరణించాడు. దృహదబలుడు మరణం తర్వాత కోసల రాజ్య ప్రభావం క్రమంగా తగ్గిపోయింది. శ్రీరామ జన్మభూమిలో మాత్రం పూజలు అలాగే కొనసాగాయి.

అటు కాలచక్రం వేగంగా మారింది… భారత దేశంలో కొత్త రాజవంశాలు పుట్టుకువచ్చాయి. నంద వంశరాజులు, మౌర్య వంశరాజుల వచ్చారు. వీరి పాలనలో కూడా శ్రీామజన్మభూమిలోని రామమందిరం చెక్కుచెదరకుండా అలాగే ఉంది.

క్రీస్తు పూర్వం..మూడవ శతాబ్దంలో ( యుగాబ్ది 3100)గ్రీకు దేశానికి చెందిన యవనులు భూమార్గం గుండా భారత దేశంపై ఆక్రమణ చేశారు. దాదాపు 60 సంవత్సరాలపాటు యువనులకు, భారతీయుల మధ్య యుద్ధం కొనసాగింది. ఒకసారి విజయం యవనులను వరిస్తే.. మరోసారి విజయం భారతీయులను వరించేది. ఆ తర్వాత కొంతకాలంపాటు కౌశంబిని యవనులు పాలించారు.

క్రీ.పూ. 150 సంవత్సర ప్రాంతంలో మినేండర్ అనే యవనుడు మొదటిసారిగా అయోధ్య నగరంపై దాడి చేశాడు. భారత దేశంలో యవన సామ్రాజ్య స్థాపన కోసం.. కుటిలనీతితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి తన పేరును మిహిరగుప్తగా మార్చుకున్నాడు. ఆ సమయంలో ఉత్తర భారతం మొత్తం కూడా బౌద్ధ సంప్రదాయ ప్రభావం అధికంగా ఉండేది. అయినా కూడా అయోధ్యలో శ్రీరాముడి పట్ల ప్రజల భక్తిశ్రద్ధలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో మినేండర్… అపార సైన్యంతో లవ, కుశల చేత నిర్మితమైన శ్రీరామజన్మభూమి మందిరాన్ని ధ్వంసం చేయించాడు. మందిర రక్షణ కోసం పోరాటం జరిగింది. శ్రీరామ జన్మభూమిపై జరిగిన తొలి విదేశీ దురాక్రమణ కూడా ఇదే.

అయితే మినేండర్ చేసిన దాడితో భారత ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. తమ నమ్మకాలు, స్వాభిమానంపై జరిగిన దాడిగా భావించారు. శుంగ వంశరాజు ఘమస్సేునుడి నాయకత్వంలో భారతీయులు అందరు ఏకమై యవనులను ఓడించారు. ఈ యుద్ధంలో మినేండర్ మరణించాడు. శ్రీరామ జన్మభూమిలో తిరిగి రామమందిరం పునర్ నిర్మాణం చేయాలని నిర్ణయం జరిగింది. అయితే యుద్ధంలో మినేండర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన యవనులు పగతో రగిలిపోయారు. తర్వాత అదేపనిగా వరుసగా దండయాత్రలు కొనసాగించారు యవనులు.! దీంతో అయోధ్యలో రామజన్మభూమి మందిర పునర్ నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది.

ఇలా వాయిదా పడుతూ వచ్చిన శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణాన్ని తర్వాత కాలంలో ఎవరు తిరిగి నిర్మించారో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి నేషనల్ లిస్ట్ హబ్. మనసా వాచా కర్మణా దేశ హితం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × four =