శ్రీనగర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాది.. పోలీసులపై కాల్పులు

0
1163

జమ్మూకశ్మీర్ కుదటపడుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ తోపాటు మొత్తం 24 దేశాలకు చెందిన ప్రతినిధులతోకూడిన బృందం జమ్మూకశ్మీర్ లో పర్యటించింది. కశ్మీర్ లోయతోపాటు… జమ్మూ రీజియన్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి స్థానికలతో ముచ్చటించారు. జమ్మూకశ్మీర్ పై పాకిస్తాన్ చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టేలా భారత్ కు అండగా నిలిచారు. అయితే ఇది మింగుడు పడని పాక్ ప్రేరిత ఉగ్రమూకలు… తమ ఉనికిని చాటుకునేందుకు డ్యూటిలో ఉన్న పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు.

శ్రీనగర్ భగత్ బర్జుల్లా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. భర్జుల్లాలోని ఓ షాపు వద్ద సెక్యూరిటీ సిబ్బంది నిలబడి ఉండగా… వెనుక నుంచి నడుచుకుంటు వచ్చిన ఓ ఉగ్రవాది…తన దుస్తుల్లో దాచుకున్న ఏకే 47 రైఫిల్ తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఊహించని ఘటనకు చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అటు కాల్పులు జరిపిన ఉగ్రవాది… సైతం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా సమీపంలోని సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యింది.ఈ కాల్పుల్లో సొహైల్‌ అనే కానిస్టేబుల్‌ ఘటనా స్థలంలో మృతిచెందగా.. మహ్మద్‌ యూసుఫ్‌ అనే మరో కానిస్టేబుల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు.. దుండగుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గత మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోఘటన. అత్యంత భద్రత ఉండే దుర్గనాగ్‌ ప్రాంతంలో ఓ రెస్టారెంట్‌ యజమాని కుమారుడిపై బుధవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి గాయాలయ్యాయి.

జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు 24మంది దౌత్యప్రతినిధుల బృందం పర్యటించిన సమయంలోనే… భారత్ ను అభాసుపాలు చేసేందుకు…, కశ్మీర్ లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తతంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి కొనసాగింపుగానే…, కావాలనే పాక్ ప్రేరిత ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు గురువారం అర్దరాత్రి షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరేతోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 + nineteen =