More

  వీర శివాజీ గాథను వినురా..!

  రాష్ట్రాన్వయోత్తమ వీర క్షత్రియ మౌళి…! పేదలపాలిట దయాగుణాంబుధి..!  దేశ… ధర్మ… గో… వేదాది రక్షా సంకల్పితుడు… తుల్జా భవానీ మాతా భక్తాగ్రేసరుడు..! ధీరోదాత్తుడు… హిందూ స్వరాజ్య ధర్మ నిష్ఠాపరుడు.., హిందూ పదపాదషాహీకి ప్రభువుగా పట్టాభిషిక్తుడు…శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు ! ఆయన జయంతి నేడు!  

  శివాజీ మహారాజ్ కి మించిన మహానాయకుడు మరొకడెవరన్నా  ఉన్నారా? ఆయనలాంటి తపస్వి.. భక్తుడు, ప్రజారంజకుడైన రాజు మరొకడెవరైనా ఉన్నారా? మన పురాణగాథల్లో వర్ణించినట్లుగా ఒక మహత్కార్యాన్ని నెరవేర్చడం కోసమే జన్మించిన అసాధారణమైన జీవితం ఆయనది. రాజు అనేవాడు ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో ఆయన జీవితం మనకు చెబుతుంది.!

  హిందూ జాతి ఆత్మచైతన్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ జన్మించిన భారతమాత సుపుత్రులకు ప్రతినిధి శివాజీ మహారాజు!  వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోతున్న భారత దేశ భవితవ్యం కోసం… తనదైన దార్శనికతతో… మార్గం చూపాడు.  చిన్న  చిన్న రాజ్యాలు ఒక ఛత్రం కింద సమాహితమై… ఒక విశాలమైన సమైక్య హిందూ సామ్రాజ్యంగా రూపుదిద్దుకునేలా బాటలు వేసిన సాటిలేని వీరుడాయన!

  శివాజీ మహారాజ్… జీవన కాలం 17వ శతాబ్దం.! అప్పటికే దక్షిణ భారతంలోని ఏకైక హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం…,  తళ్లికోట యుద్ధానంతరం పూర్తిగా పతనమైపోయింది. ఉత్తరభారతంలో విదేశీ దురాక్రమణదారులైన మొగలుల నిరంకుశపాలనలో స్వజాతిజనులైన హిందువులు అష్టకష్టాలు పడసాగారు. పరాయి పాలనను వ్యతిరేకించే స్వాభిమానధనులైన చాలా మంది రాజపుత్ర రాజులు సైతం…, యుద్ధాన్ని వదలి…, విదేశీ దురాక్రమణదారులతో సంధి చేసుకుని కాలం వెళ్లదీస్తున్న రోజులవి.!

  సమస్త భారత దేశం….ఇస్లామ్ మత రక్కసి కబంధ హస్తాల్లో చిక్కి విలవిలాడుతోంది. భారతవాసులైన హిందువుల జీవితం నరకప్రాయంగా మారింది. ఒక చేత కత్తిని చూపిస్తూ….,  మరో చేత ఇస్లాం స్వీకరిస్తావా..? లేక చస్తావా అనే అజ్ఞలు..! హూంకరింపులు…! బెదిరింపులు…! సామూహిక మత మార్పిడీలు…! లేదంటే మూకుమ్మడిగా హిందువులందరిని బంధించి, నడి రోడ్డు మీద కూడలికి తీసువచ్చి…,  అందరి ముందు…బహిరంగా శిరచ్ఛేదానాలు…! హిందువులకు పరమ పవిత్రమైన మందిరాల విధ్వంసాలు…!

  ఇక ఈ దేశంలో హిందువులు అనేవారే లేకుండా పోతారానేంతగా… మారిపోయిన పరిస్థితులవి..! ఈ పుణ్యభారత్ లో… ఇక హిందూ స్వరాజ్య భానుడు….అస్తామించాడా.? వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వేద సంస్కృతిని రక్షించేవారే లేరా ? అంటూ ఆర్తితో సాధు సంతులు చేసిన  తపస్సు ఫలించింది.!

  గాఢాంధకారం అలముకున్న ఆ కటిక చీకటిని చేధించే…, హిందూ జాతి ఆశాకిరణం…, పడమటి కనుమల్లోని.., సహ్యాద్రికొండల్లో ఛత్రపతి శివాజీ రూపంలో ఉదయించాడు. స్వధర్మనిష్టతోపాటు… హిందూస్వరాజ్య స్థాపన లక్ష్యాన్ని చిన్నతనంలోనే శివాజీకి నిర్దేశించింది వీరమాత జీజాబాయి.! నూనుగు మీసాల వయస్సులోనే…. స్వరాజ్య స్థాపన కోసం జాతిజనులను ఏకం చేశాడు శివాజీ.! వారిని వీరులుగా తీర్చిదిద్దాడు. విజయమే లక్ష్యంగా అన్ని పోరాటల్లో ముందు నిలుస్తూ ప్రేరణగా నిలిచాడు.

  ఆనాటి ముస్లిం పాలకుల కుటిల నీతికి అంతే చాకచక్యంతోనే సమాధానం చెప్పాడు. అంతవరకు హిందువులు ఆచరిస్తూ వస్తున్న ధర్మయుద్ధమనే భావనను…,  వర్తమాన, కాల పరిస్థితులకు అగుణంగా పూర్తిగా సమీక్షించాడు ఛత్రపతి శివాజీ మహారాజ్.!  తనదైన దృక్పదంతో…. హిందూ ధర్మయుద్ధనీతిలో పెనుమార్పులు తీసుకువచ్చాడు. శత్రువుల కదలికలకు అనుగుణంగా…యుద్ధభూమిలో వేగంగా ప్రతిస్పందించేలా సైన్యాల్ని తీర్చిదిద్దాడు. తక్కువ సైన్యంతో శత్రువుకు… ఎక్కవ నష్టం కలిగించేలా, గెరిల్లా యుద్ధతంత్రాన్ని ప్రయోగించాడు. భారీ సంఖ్యలో ముస్లిం సేనల్ని తుదముట్టించాడు.!

  బీజాపూర్ సుల్తాన్…  సేనాని అఫ్జల్ ఖాన్ పన్నిన…పన్నాగాన్ని ముందే పసిగట్టిన శివాజీ…. పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చి చంపేశాడు. 70 వేల సేనతో వచ్చిన సిద్దీ జౌహార్ ను తప్పుదోవపట్టించి మట్టికరిపించాడు. అలాగే అప్పటి వరకు భారతీయులు మర్చిపోయిన తమ ప్రాచీన నావికాదళ ప్రాముఖ్యాన్ని గుర్తించాడు శివాజీ..! జలదుర్గాలను పటిష్టపర్చి నావిక దళాన్ని పునర్ నిర్మాణం చేశాడు. సముద్రమార్గం ద్వారా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న యూరోప్ దేశాల మూకలను సైతం కట్టడి చేశాడు.

  ఇటు ఔరంగజేబు…సొంత మామ అయిన షహిస్తఖాన్.., లక్ష మంది సైన్యంతో వస్తే…, ఆ రోజుల్లో దేశంలోని ఏ రాజు కూడా చేయలేని సాహసం శివాజీ చేశాడు.! రాత్రికి రాత్రే…ఏకంగా శత్రు శిబిరంలో చొరబడి… మొగల్ సేనాధిపతి షహిస్తఖాన్ చేతివేళ్ళను తెగనరికాడు.

  శివాజీని బంధించడం తమ ముస్లిం సేనల వల్ల కాదని…  భావించిన ఔరంగజేబు…. హిందూ రాజైన రాజా జయసింగ్ ను శివాజీ మీదకు పంపిస్తే…, తనదైన నేర్పును ప్రదర్శించాడు.! రెండు వైపుల హిందూ సైనికులే మరణించడం దేశహితానికి మంచిది కాదని.., రాజా జయసింగ్ తో సంధి చేసుకున్నాడు. ఆగ్రా కోటకు వెళ్లి ఔరంగజేబును ఎదిరించి బందీ అయ్యాడు. అనంతరం అంతే చాకచక్యంతో తప్పించుకుని… ఔరంగజేబు వెన్నులో వణుకుపుట్టించాడు.

  1674లో ఛత్రపతి బిరుదుతో రాజ్యాభిషేకం చేసుకునేటప్పటికీ వీరశివాజీ వయస్సు ఎంతో తెలుసా! కేవలం 44 సంవత్సరాలు మాత్రమే.! అంతేకాదు శివాజీ మహారాజు జీవించినంత కాలం…, దక్షిణ భారతంలో అడుగు పెట్టాలంటే వణికిపోయాడు ఔరంగజేబు.! శివాజీ తర్వాత… ఆయన వారసులు…150 ఏళ్ళకు పైగా  భారత దేశం మొత్తం విజయ దుందుభుల్ని మోగించారు. ఢిలీ సింహాసనాన్ని సైతం తమ చెప్పుచెతుల్లో పెట్టుకున్నారు.

  శివాజీ మహారాజు సాధించిన విజయాలను ఎందరో కవులు రోమాంచితంగా వర్ణించారు.శివాజీ జన్మించి ఉండకపోతే కాశీ కళ తప్పి ఉండేది. మధుర మసీదై ఉండేది. హిందువులందరికీ సున్నతి జరిగి ఉండేదని కవిభూషణుడు వర్ణించాడు. జనతా రాజా ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని పురస్కరించుకుని… ఆ మహోన్నత హిందూ వీరుడికి… నేషనలిస్ట్ హబ్ వినమ్ర నివాళులు అర్పిస్తోంది.!

  Related Stories