More

    రాహుల్, ప్రియాంకల విజ్ఙాన ప్రదర్శన..!

    తాముండగా కాంగ్రెస్ పార్టీ పరువు తీసే ఛాన్స్.. ఇంకొకరికి ఎందుకివ్వాలని అనుకున్నారేమో. ఆ అన్నా చెల్లెళ్లు ఇటీవల పోటీపడి మరీ పార్టీ గాలి తీసేస్తున్నారు. పుదుచ్చేరిలో అన్న రాహుల్ గాంధీ విజ్ఙాన ప్రదర్శన మరిచిపోకముందే.. చెల్లెలు ప్రియాంక అంతకమించిన జ్ఙానాన్ని ప్రదర్శించారు. తాజాగా పుదుచ్చేరిలో పర్యటించిన రాహుల్ గాంధీ.. సీఎం నారాయణ స్వామి ప్రదర్శించిన స్వామి భక్తికి పొంగిపోయాడు. మత్స్యకారుల ఆగ్రహాన్ని అనుగ్రహంగా భావించి గ్రహపాటుకు గురయ్యాడు. అంతటితో ఆగకుండా ఆల్రెడీ వున్న మత్స్యశాఖను లేదని చెప్పాడు. అంతేనా మత్స్యశాఖను ఏర్పాటు చేస్తానని తన తెలివితేటలు ప్రదర్శించాడు. ఇక, అన్నముందు తక్కువైపోతానని అనుకుందో ఏమో ఆయనకు మించిన విజ్జానాన్ని ప్రదర్శించారు ప్రియాంక వాద్రా.

    విషయం ఏమిటంటే.. యూపీలో యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. తాజాగా ట్విట్టర్ లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. అందులో లఖింపుర్ ఖేర్ ప్రాంతానికి చెందిన అలోక్ మిశ్రా అనే చెరుకు రైతు పేరు ప్రస్తావిస్తావించారు. అతనికి ప్రభుత్వం 6 లక్షల రూపాలయు చెల్లించాల్సి వుందని రాసుకొచ్చారు. సకాలంలో చెల్లించకపోవడంతో.. అలోక్ మిశ్రా చెరుకు పంట కోసం 3 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అలోక్ మిశ్రా ఒక్కడి పరిస్థితి మాత్రమే కాదని.. యూపీలో లక్షలాది రైతులది పరిస్థితి ఇదేనని రాశారు. పదివేల కోట్ల దాకా బకాయిలున్నాయని ట్వీట్ చేశారు. దీనికి చెరుకు లోడ్లతో వున్న ట్రాక్టర్ల ఫొటోను జతచేశారు. అంతకుముందు చేసిన మరో ట్వీట్‎లో వ్యవసాయ చట్టాలపై విమర్శలు గుప్పించారు. అయితే, ట్విట్టర్ లో ప్రియాంక గాంధీ ఏ రైతు పేరైతే ప్రస్తావించారో.. ఆ రైతే మీడియా ముందు ఆమె గాలి తీసేశాడు.

    అలోక్ మిశ్రా ఏం చెప్పాడో విన్నారు కదా.. పొలిటికల్ గేమ్స్ ఆడటం గాంధీ ఫ్యామిలీకి అలవాటైపోయిందన్నాడు. ప్రియాంక జీ ఇలాగే రాజకీయాలు చేస్తుంటారని ఎద్దేవా చేశాడు. ఇది గతేడాదికి సంబంధించిన వార్త అని.. ఆమెకు వార్తను పూర్తిగా చదివే అలవాటు లేదేమోనన్నాడు. గతేడాది కరోనా వ్యాప్తి వల్ల ప్రభుత్వం నుంచి చెల్లింపులు ఆలస్యమయ్యాయని తెలిపారు. కానీ, ఈ ఏడాది అలా జరగలేదని.. తమ బాకీలు పూర్తిగా చెల్లించారని స్పష్టం చేశాడు అలోక్ మిశ్రా.

    అదన్నమాట ప్రియాంకా వాద్రా విజ్ఙాన ప్రదర్శన. దీంతో ప్రియాంక టాలెంట్ పై నెటిజన్లు సైటైర్లు వేస్తున్నారు. ఇలా వెనకాముందు చూసుకోకుండా అవాస్తవాలను వాస్తవాలను చూపించినందుకే.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా తయారైందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అతితెలివి వల్లనే కదా.. యూపీలో 33 లోక్ సభ స్థానాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తే.. 30 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి.. కేవలం మూడు సీట్లలో విజయం సాధించిందని ఎద్దేవా చేస్తున్నారు. మూడు శాతం సక్సెస్ రేట్ సాధించిన ఘనత ఆమెదే కదా అంటూ విమర్శిస్తున్నారు.

    గతంలో యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. రాహుల్, ప్రియాంకలు చేసిన విమర్శలు కూడా రివర్స్ అయ్యాయి. ఇలా.. అన్నను మించి చెల్లెలు, చెల్లెల్ని మించి అన్న.. ఇలా తమ అజ్ఙానాన్ని చాటుకుంటున్నా.. వారి అతితెలివితో పార్టీని డ్యామేజీ చేస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వీరి వినోదాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు.

    Trending Stories

    Related Stories