More

  రాహుల్ తెగింపు.. ఆరెస్సెస్ పై అవాకులు..!

  నాడు తన గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీ దేశంలో  అత్యవసర పరిస్థితి విధిస్తూ తీసుకున్న నిర్ణయం పొరబాటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంగీకరించారు. 1975-77 మధ్య కాలంలో దేశం ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొందని ఆయన అన్నారు. ఆ కాలంలో జరిగిన ఈ ఉదంతం తప్పేనని పేర్కొన్నారు. ఆ నాడు పత్రికా స్వేఛ్చకు సంకెళ్లు పడ్డాయని, ప్రభుత్వాన్ని విమర్శించిన విపక్ష నేతలను జైళ్లలో నిర్బంధించారని, పౌర హక్కులను అణచివేశారని వార్తలు వచ్చ్చాయని, కానీ అప్పటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందని ఆయన చెప్పారు. అయితే అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ కాంగ్రెస్ తన సంస్థాగతమైన ‘డిజైన్’ ని వీడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమర్జన్సీని విధించినప్పుడు దేశంలో సంస్థలేవీ బలహీనపడలేదని, కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వీటిని నిర్వీర్యం చేస్తోందని రాహుల్ ఆరోపించారు.  దీనికి వివరణ ఇస్తూ.. పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఉందని, భారత సంస్థాగత ఫ్రెమ్ వర్క్ కి ఎలాంటి భంగం వాటిల్లలేదని ఆయన చెప్పారు.  అసలు పార్టీకి ఇంతటి సత్తా కూడా లేదన్నారు. ప్రముఖ ఎకనామిస్ట్ కౌశిక్ బసుతో వర్చ్యువల్ గా ఇంటరాక్ట్ అయిన ఆయన.. ఆ నాటి పరిస్థితికి, నేటి పరిస్థితికి మధ్య చాలా తేడా ఉందన్న విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. నేడు ఆర్ ఎస్ ఎస్ తన నేతలతో ఈ వ్యవస్థను నింపేసిందన్నారు.  దీని ప్రభావం దేశం మీద, సమాజం మీద చాలా ఉందన్నారు. ఎన్నికల్లో బీజేపీపై తమ పార్టీ విజయం సాధించినా, ఈ నేతల బెడద నుంచి తప్పించుకోజాలదన్నారు.

  ఇండియాలో ఇన్స్టిట్యూషనల్ బ్యాలన్స్ అన్నదానీపై  బీజేపీ ‘మౌలిక గురువైన’ ఆర్ఎస్ఎస్ ఎటాక్ చేసిందని, అసలు ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

  మరోవైపు ఎమర్జెన్సీ విధింపు పొరబాటేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ గురించి ఆలోచించడానికి ఆయనకు ఇంతకాలం పట్టిందా అని సెటైర్ వేశారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రభుత్వం అన్ని సంస్థలను అణగదొక్కిందని, ఎంపీలను, ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని,  దాదాపు అన్ని పార్టీలను బ్యాన్ చేశారని, వార్తా పత్రికలను మూసివేశారని ఆయన పేర్కొన్నారు. ఆర్ ఎస్ ఎస్ ప్రపంచంలోనే అతి పెద్ద దేశభక్తియుతమైన సంస్థగా ఆయన అభివర్ణించారు. బీజేపీ నేతల్లో చాలామంది నాడు ఎమర్జెన్సీ సమయంలో జైళ్లకు వెళ్ళినవారేనని ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇక ఇదే విషయం పై జాతీయవాదులు రాహుల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. సెన్స్ లెస్ వ్యాఖ్యలు చేస్తే మిగిలిన కూసింత గుర్తింపు కూడా పోతుందని హితవు పలికారు. ఆర్ ఎస్ ఎస్ ఈ దేశానికి వెన్నెముక అని.. అటువంటి గొప్ప సంస్థ  గురించి అర్ధం చేసుకోవాలంటే రాహులు వందల జన్మల ఎత్తినా సాధ్యపడదని ఎద్దేవా చేశారు. నీచ రాజకీయాలకు పాల్పడుతూ విదేశీయుల ముందు స్వదేశాన్ని దూషించడంతో సమానంగా రాహుల్ చర్యలను అభివర్ణిస్తున్నారు.

  Trending Stories

  Related Stories