More

    మోదీ సభకు వైసీపీ ఏర్పాట్లు..! గరమైతున్న విపక్షాలు..!

    ప్రధాని మోదీ టూర్‎పై వైసీపీ ఫుల్ ఫోకస్ చేసింది. ఈ నెల 12న AU ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‎లో జరిగే భారీ బహిరంగ సభను… వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.30 ఎకరాల సభా స్థలాన్ని జన సంద్రంగా మార్చేందుకు అంతా సిద్దం చేస్తోంది. అందుకు గాను…శ్రీకాకుళం, విజయనగరంజిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా, అల్లూరి జిల్లాల నుంచి మూడు లక్షలపై చిలుకు ప్రజలు హాజరయ్యేలా కసరత్తు చేస్తున్నారు.అందుకు తగ్గట్లు కుర్చీలు, కూలర్లు, భారీగా టెంట్లు వేశారు. దూర ప్రాంతాలనుండి వచ్చే ప్రజలకు రవాణా సదుపాయంతో పాటు ఆహార, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తోంది ప్రభుత్వం.

    ఇందుకోసం గత కొద్ది రోజులుగా… మంత్రి అమర్నాథ్, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డిలు నియోజక వర్గాల వారిగా సమావేశాలు నిర్వహించి, పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. సభకు ప్రజలను తరలించడానికి 4 వేల బస్సులు అవసరమని అంచనా వేశారు. అయితే ఎక్కువ సంఖ్యలో అనకాపల్లి, విశాఖ జిల్లా నుండి వచ్చే అవకాశం ఉన్నందున మొతంగా 3 వేల 700 బస్సులను జనాలను తరలించడానికి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

    ఇక ప్రధాని సభకు వైసీపీ పెత్తనం ఏంటని తెలుగుదేశం, వామపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రాజధాని, రైల్వే జోన్ అంశాలు…ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. భోగపురం ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన ఉంటుందా…అన్నది కూడా ప్రధాని ఎజెండా లో ఉందా లేదా అన్న అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి. అయితే వీటన్నింటికి వైసీపీ సమగ్ర వివరణ ఇచ్చింది. ఇది రాజకీయ సభ కాదని, దేశ, రాష్ట్ర ప్రజల అభివృద్ధి పనుల కోసం ప్రధాని పర్యటిస్తున్నారని స్పష్టం చేసింది వైసీపీ.

    Trending Stories

    Related Stories