More

    మునుగోడు ఉపఎన్నికలో పోటీలో నిలబడింది ఎంతమందంటే..!

    నవంబర్ 3వ తేదీన మునుగోడు శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 17వ తేదీ సోమవారం తో ముగియడంతో.. అధికారులు పోటీలో ఉన్నవారి జాబితా ప్రకటించారు. మొత్తం 130 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అధికారులు 47 నామపత్రాలు చెల్లినవిగా పరిగణించి తిరస్కరించారు. మరో 36 మంది నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 47 మంది పోటీలో నిలిచారు. వీరిలో టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీతో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు ఉన్నారు.

    మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికి ప్రధాన పోటీ మాత్రం టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

    Trending Stories

    Related Stories