More

    మీనా హారిస్ కు వైట్ హౌజ్ వార్నింగ్..!

    చాలా మంది తాము అధికార పదవుల్లో ఉండకపోయినా.. వారి బంధు మిత్ర సపరివారంలో ఏ ఒక్కరు ఆ హోదాలో ఉన్నా దానిని అడ్డం పెట్టుకుని దందాలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటారు. ఈ దేశం ఆ దేశం అని కాదు అన్ని చోట్లా ఇటువంటి వారు కనిపిస్తారు. తాజాగా అగ్రరాజ్యం గా చెప్పుకునే అమెరికాలో సైతం అటువంటి ఒక వార్త అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

    అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలుగా మీడియాలో పేరు సంపాదించుకుని ఇటీవల భారత్ కు ఎగైనిస్ట్ గా వ్యాఖ్యలు చేసిన మీనా హారిస్ నిర్వాకం ఒకటి తాజాగా అక్కడి వైట్ హౌస్ అధికారులకు కోపం తెప్పించింది.

    నిజానికి కమలా హారిస్ మేనకోడలుగా మన తెలుగు మీడియా ఆంగ్ల అనువాదంలో భాగంగా తీసుకుని మీనా హారిస్ కు సంబంధించిన కథనాలు రాస్తుంది కానీ.. కమలా హారిస్ చెల్లెలి కూతురు ఈ మీనా హారిస్.. దీని బట్టి ఆమె ఈమెకి తల్లి వరస.. ఈమెకు ఆమె కూతురు వరస.. కానీ ఇన్ని ఇన్ని బంధాలకు విడి విడి పేర్లు లేని భాష ఇంగ్లీష్ లో చెల్లెలి కూతురుని నీస్ గానే పిలవడం పరిపాటి.. విషయం తెలిసిన మనమైనా ఇకపై మీనా హారిస్ ను కమలా హారిస్ చెల్లెలి కూతురుగానే పిలుద్దాం.

    ఈ మ్యాటర్ అలా పక్కన బెడితే అసలు టాపిక్ లోకి వద్దాం..

    మీనా హారిస్ వైట్ హౌస్ వర్గాలకు కోపం తెప్పించే పనేం చేసింది అనేది నేను వీడియో ప్రారంభంలో చెప్పిన నాలుగు లైన్లతో మీకు అర్ధమవ్వాలి.

    నిజానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్… సోషల్ మీడియాను చూసుకునే మీనా హారిస్‌‌కి సహజంగానే కమలా హారిస్ వల్ల చాలా బ్రాండ్ పెరిగింది. ఇది వరకు మీనా హారిస్ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు చాలా మందికి తెలుసు. చెప్పాలంటే అమెరికా రోజు వారీ వార్తల్లో ఇప్పుడు మీనా హారిస్ కూడా ఉంటున్నారు. దీనిపై వైట్ హౌస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదివరకు పర్లేదు గానీ… ఇప్పుడు కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాబట్టి… ఇకపై ఆమె పేరును వాడుకుంటూ మీనా హారిస్ తన బ్రాండ్ పెంచుకోవాలని చూస్తే కుదరదు అంటున్నాయి. దీనిపై చట్టపరమైన రూల్స్ అమలు చేయాలని వైట్ హౌస్ వర్గాలు కోరినట్లుగా ఓ రిపోర్ట్ చెబుతోంది.

    “కొన్ని కొన్ని చేయడానికి వీల్లేదు” అని వైట్ హౌస్ అధికారి ఒకరు… 36 ఏళ్ల మీనా హారిస్‌కు చెప్పినట్లుగా… లాస్ ఏంజిల్స్ టైమ్స్ చెబుతోంది. “మీరు మీ పద్ధతి, వ్యవహార శైలిని మార్చుకోవాలి” అని అధికారి చెప్పినట్లు తెలిసింది.

    మీనా హారిస్… స్వయంగా ఓ లాయర్… వ్యాపారవేత్త కూడా. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఆమె పెట్టే పోస్టుల్లో కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని రాజకీయపరమైనవి ఉంటున్నాయి. ఆమె పిల్లల పుస్తకాలు కూడా రాస్తారు. ఓ పుస్తకానికి ఆమె “కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా” అని పేరు పెట్టారు. మహిళల చారిటబుల్ క్లాతింగ్ బ్రాండ్ ఫెనోమెనల్ కూడా ఆమెదే. తాజాగా మీనా హారిస్… ఏంబిషియస్ గర్ల్ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. మర్నాడు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేయబోతుంటే… ఆ ముందు రోజు దాన్ని విడుదల చేయడం అభ్యంతరకరంగా మారింది.

    ఎన్నికల తర్వాత… కమలా హారిస్ పేరుతో ఏ ఉత్పత్తులూ తయారుచేయకూడదని వైట్ హౌస్ లాయర్లు మీనా హారిస్‌కు చెప్పినట్లు తెలిసింది. ఐతే… కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా పుస్తకంలో కమలా పేరు వాడటంపై వైట్ హౌస్ వర్గాలు అభ్యంతరం చెబుతున్నాయి. అలాగే ఓ షర్టుపై మీనా హారిస్… వైస్ ప్రెసిడెంట్ ఆంటీ అని రాయడం కూడా సమస్యగా మారిందంటున్నారు. లాయర్లు చెప్పినా మీనా హారిస్ తీరు మార్చుకోవట్లేదనే ప్రచారం జరుగుతోంది. జో బిడెన్‌కి సంబంధించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రైవేట్ విమానంలో వెళ్లిన మీనా హారిస్… ఆ విషయాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంపై అభ్యంతరం చెబుతున్నారు. ప్రస్తుతం మీనా హారిస్ ఆన్‌లైన్ స్టోర్‌లోని స్వెట్ షర్టులపై ఐయామ్ స్పీకింగ్ అనే పదం ఉంది… ఈ పదాన్ని కమలా హారిస్… వాడారు. దీన్ని వాడటంపై కూడా వైట్ హౌస్ లాయర్లు అభ్యంతరం చెబుతున్నారు.

    ఇలా ఒకటా రెండా మీనా హారిస్ దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టకోవాలనే సామెతను ఒంటబట్టించుకున్నట్లు అన్ని విధాలుగా అమాంతం కమలా హారిస్ పేరును వాడేస్తూ విచ్చలవిడి విహంగ పక్షిగా ఎగిరెగిరి పడుతుందని అంటున్నారు.

    Trending Stories

    Related Stories