More

  మమతను ఓటమి భయం వెంటాడుతోందా? అందుకే బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేస్తోందా?

  ఓటమి భయం ఏమైనా చేయిస్తుంది.అంత వరకు బీరాలు  పలికిన నోటితేనే.., చివరకు బ్రతిమాలేలా చేస్తుంది. యుద్ధంలో గెలవడం ముఖ్యం..అందుకోసం ఏం చేసినా ఫర్యాలేదు. ALL IS FAIR IN LOVE AND WAR అని అంటారు. ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారా?

  ఒకప్పటి తన అనుచరుడైన సుబేందు అధికారి బీజేపీలో చేరడంతో ఊగిపోయిన మమతా బెనర్జీ నందిగ్రామ్ బరిలో నిలబడి అతన్ని ఓడిస్తాను చూడండి అంటూ శపథం చేశారు.! నిజానికి మమతా బెనర్జీ బెంగాల్ సీఎం కావడానికి బాటలు వేసిన ఉద్యమం నందిగ్రామ్ ఉద్యమం. అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం టాటా నానో ఫ్యాక్టరీ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం నిర్వహించారు. ఋ ఉద్యమంలో ఆమెకు అండగా  నిలిచింది సుబేందు అధికారి కుటుంబం. ఈ ప్రాంతంలో సుబేందు కుటుంబానికి మంచి పట్టుంది. గతంలో రెండు సార్లు తమ్లుక్ లోక్ సభ స్థానానికి సుబేందు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో నందిగ్రామ్ నుంచి సుబేందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుబేందు తోపాటు ఆయన తండ్రి శిశిర్అధికారి,  పెద్ద అన్నయ్య దివ్యేందు అధికారి కూడా కాంటి, తమ్లుక్ ఎంపీలుగా ఉన్నారు.

  పశ్చిమ మిడ్నామ్ పూర్ , జంగల్ మహల్, బంకురా, పురూలియా, ఝార్ గ్రామ్ , బిర్భుంలోని దాదాపు 40 నియోజకవర్గాలు కూడా వీరి కుటుంబం కంట్రోల్ ఉంటాయని చెబుతుంటారు. అలాంటి కుటుంబం ఇప్పుడు దీదీకి వ్యతిరేకంగా మారింది. మమతా తన సొంత నియోజకవర్గం వదిలి మరి నందిగ్రామ్ లో పోటీకి దిగారు. నామినేషన్ వేసిన రోజునే నిర్వహించిన ఓ ర్యాలీలో కాలుకు గాయమై ఆమె చక్రాల కూర్చిపై నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.  

  అయితే గ్రౌండ్ రియాల్టీ వచ్చేసరికి మాత్రం ఆమెకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్లుగా ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీ కి మధ్య కాంటేకి టక్కర్ నడుస్తోందని సర్వేలు చెబుతున్నాయి. నందిగ్రామ్ లో లోకల్ నేతగా ఉన్న సుబేందు అధికారి వైపే మొగ్గుతున్నట్లు తెలుస్తోంది.  మమతా బెనర్జీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ ఊహించినట్లుగా నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముస్లింలు మమతకు అండగా ఉంటారని భావించారని అయితే కొంతమంది ముస్లింలు.. తమ నేత అబ్బాస్ సిద్ధిఖీ స్థాపించిన నేషనల్ సెక్యులర్ ఫ్రంట్ వైపు ముస్లింలు మొగ్గుచూపుతున్నారని … మరికొంతమంది తృణమూల్ వైపు ఉన్నారని తాజాగా అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో గుర్తించడంతో ఆయన ప్లాన్ బీ అమలు చేస్తున్నారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

  దీంతో సుబేందు అధికారితోపాటు తృణమూల్ కాంగ్రెస్ ను విడిచి వెళ్లిన స్థానిక ముఖ్యనేతలకు స్వయంగా మమతా బెనర్జీ ఫోన్ లు చేస్తూ తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సుబేందు అధికారి ప్రధాన అనుచరుడైన ప్రళయ్ పాల్ కు మమతా బెనర్జీ ఫోన్ చేసినట్లుగా చెబుతున్న ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రళయ్ తో జరిగిన ఫోన్  సంభాషణలో మమతా… నందిగ్రామ్ లో తన గెలుపునకు సహకరించాలని అని విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రళయ్ పాల్ శనివారం మీడియాకు ఈ ఆడియాను విడుదల చేశారు.

  ఇప్పుడు ఈ అంశం బెంగాల్ అంతటా చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ నందిగ్రామ్ లో ఓటమి పాలవుతున్నారని, అందుకే లోకల్ బీజేపీ నేతలకు వరుసగా ఫోన్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.సరిగ్గా ఫస్ట్ ఫేస్ పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఆడియో ను బీజేపీ నేతలు విడుదల చేయడంతో… తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆది మమతా ఫోన్ కాల్ అని ఎవరు నిర్దారించలేదని, బీజేపీ యే ఫేక్ కాల్స్ కు కుట్రపన్నిందని ఆరోపించారు. 

  శనివారం జరిగిన ఎన్నికల హింసలో సుబేందు సోదరుడి వాహనంపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళదాడి చేశారని బీజేపీ ఆరోపించింది. నందిగ్రామ్ లో సెకండ్ ఫేస్ లో ఏప్రిల్ 1న పోలింగ్ జరగనుంది. పోలింగ్ బూత్ ల వద్ద స్టేట్ పోలీసులకు బదులుగా కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేయాలని సుబేందు అధికారి కుటుంబం ఇప్పటికే ఈసీని కోరింది.

  Related Stories