ఫైజర్ పైత్యం..! మోదీ దౌత్యం..!! అమెరికా ఆధిపత్యానికి లొంగని భారత్

0
1206

నేనే తయారు చేయాలి.. నేనే అమ్మాలి.. దేశాన్ని తాకట్టు పెట్టయినా నేను అమ్మిందే కొనాలి.. ఇదీ ప్రపంచ దేశాలపై అగ్రరాజ్యం అమెరికా ఆదిపత్య ధోరణి. చివరికి కరోనా కష్టకాలంలోనూ శవాలపై పేలాలు ఏరుకుంటోంది. కరోనా వ్యాక్సిన్లతో ఖతర్ నాక్ బిజినెస్ చేస్తోంది. పెద్దన్న పైత్యం ఏమేరకు వెళ్లిందంటే, వ్యాక్సిన్ ఒప్పందంలో భాగంగా.. దేశాల సార్వభౌమత్వాన్నే ప్రశ్నించే స్థాయికి చేరింది. ఓవైపు కరోనా కాటుకు ప్రపంచ దేశాలు బలైపోతున్నా.. ఆ విపత్తును తానే స్వయంగా అనుభవించినా.. అవన్నీ మరిచిపోయింది. ఫార్మా లాబీయింగ్ కు భాగంగా.. వాక్సిన్ల పేరుతో.. ఆంబోతులా.. దేశాలపై పడి దోచుకోవాలని చూస్తోంది.

ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన రెండో అతిపెద్ద దేశమైనప్పటికీ.. భారత్ ఫస్ట్ వేవ్ లో చాలా తక్కువ డ్యామేజీతో బయటపడింది. ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, యూరప్, అమెరికా దేశాల్లో ఫస్ట్ వేవ్ మరణ మృదంగం మోగించింది. కొవిడ్ మరణాలకు యూఎస్ సైతం అడ్డుకట్ట వేయలేకపోయింది. యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లో భారీగా మరణాలు సంభవించాయి. ముఖ్యంగా బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో డ్యామేజీ భారీగా జరిగింది. అటు,..పేద, మధ్య తరగతి దేశాలు విలవిలాడిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో ఫస్ట్ వేవ్ నుంచి బయటపడిన భారత్ లో రెండు స్వదేశీ వాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఓవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తూనే.. పేద, మధ్య తరగతి దేశాలకు ఆపన్న హస్తం అందించింది. ఏకంగా 60 దేశాలకు పైగా వ్యాక్సిన్లు సరఫరా చేసి.. పెద్దన్న పాత్రను పోషించింది.

ఇలా.. ఓవైపు భారత్ పేద దేశాలకు ఉచిత వ్యాక్సిన్లను పంపుతుంటే, అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ మాత్రం వ్యాక్సిన్ బిజినెస్ మొదలు పెట్టింది. వ్యాక్సిన్ల పేరుతో పలు దేశాలను గుప్పిట్లో పెట్టుకోవాలని పెద్ద ప్లానే వేసింది. వ్యాక్సిన్ కావాలంటే చెప్పింది వినాల్సిందేనని బెదింపులకు పాల్పడింది. ఈ క్రమంలో ఫైజర్ కంపెనీ పలు దేశాల చట్టాల్లోనూ జోక్యం చేసుకుంది. కొన్ని దేశాల్లోనైతే సైనిక స్థావరాలను, బ్యాంకు రిజర్వులను కూడా తాకట్టు పెట్టాలని కోరడం.. నరనరానా నిండిన అమెరికా ఆధిపత్య దోరణికి అద్దం పడుతోంది.

వ్యాక్సిన్ అమ్మకాల కోసం ఫైజర్ కంపెనీ.. తొమ్మిది లాటిన్ అమెరికన్, కరేబియన్ దేశాలతో ఒప్పదం చేసుకుంది. చిలీ, కొలంబియా, కొస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, మెక్సికో, పనామా, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలతో డీల్ కుదుర్చుకుంది. అయితే, అమెరికా మోసాన్ని ముందే పసిగట్టిన.. అర్జెంటీనా, బ్రెజిల్ మాత్రం ఫైజర్ ఒప్పందం నుంచి వైదొలిగాయి. అసలు వ్యాక్సిన్ ఒప్పందం నుంచి ఈ రెండు దేశాలు ఎందుకు వైదొలిగాయి..? ఏం జరిగింది..? అనే అశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

ముందు, అర్జెంటీనా విషయానికి వద్దాం. అర్జెంటీనా, ఫైజర్ మధ్య 2020 జూన్ లో చర్చలు ప్రారంభమయ్యాయి. జూలైలో అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్, ఫైజర్ అర్జెంటీనా సీఈవోతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వ్యాక్సిన్ ఒప్పందంపై విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ కు సంబంధించి ఏవైనా సివిల్ వ్యాజ్యాలు దాఖలైతే.. ఆ ఖర్చుకు పరిహారం అర్జెంటీనా ప్రభుత్వమే చెల్లించాలని ఫైజర్ పట్టుబట్టింది. అంటే, ఒకవేళ వ్యాక్సిన్ వల్ల ఏవైనా దుష్ఫలితాలు వస్తే.. వినియోగదారులెవరైనా ఫైజర్‎పై సివిల్ కేసు పెడితే.. అర్జెంటీనా ప్రభుత్వమే నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇందులో ఫైజర్ కు ఎలాంటి సంబంధం వుండదన్నమాట. దీంతో 2020 అక్టోబర్ లో అర్జెంటీనా పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అయితే, ఫైజర్ ఆ చట్టంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫైజర్ కనీసం తన స్వీయ తప్పిదాలకైనా బాధ్యత వహించాలని చట్టంలో పెట్టిన నిబంధన.. ఆ కంపెనీకి రుచించలేదు. దీంతో ఆ చట్టాన్ని తిరస్కరించింది. దీంతో చేసేదిలేక, అర్జెంటీనా పార్లమెంట్ చట్టాన్ని సవరించింది. చట్టంలోని ‘నిర్లక్ష్యం’ అనే అంశాన్ని మరింత లోతుగా వివరించింది. టీకా పంపిణీలో నిర్లక్ష్యం జరిగితే మాత్రమే ఫైజర్ బాధ్యత వహించేలా చట్టాన్ని మార్చింది.

అప్పటి కూడా ఫైజర్ కన్నింగ్ బిజినెస్ మైండ్ తృప్తి పడలేదు. కొత్త డిక్రీ ద్వారా చట్టాన్ని మళ్లీ మార్చాలంటూ డిమాండ్ చేసింది. అయితే, ఇందుకు అర్జెంటీనా ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ఫైజర్ మరో గొంతెమ్మ కోర్కెను బయటపెట్టింది. అర్జెంటీనాలో ఫైజర్ ఏవైనా సివిల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తే.. నష్టపరిహారం చెల్లించేందుకు, ఏదైనా అంతర్జాతీయ పాలసీ తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నిబంధనకు అర్జెంటీనా ఒప్పుకుంది. అయినా, ఫైజర్ సంతృప్తి చెందలేదు. 2020 డిసెంబర్ లో మరిన్ని డిమాండ్లతో ముందుకొచ్చింది. ఈసారి అసలైన వికృతరూపాన్ని ప్రదర్శించింది. వ్యాక్సిన్ ఒప్పందంలో బాగంగా.. ఏకంగా అర్జెంటీనా సార్వభౌమత్వాన్నే తనఖా పెట్టాలని కోరింది. బ్యాంకు నిల్వలు, సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయ భవనాలను పణంగా పెట్టాలని కోరింది. భవిష్యత్తు ఇబ్బందుల దృష్ట్యా వ్యాక్సిన్ తయారీదారులు కొంత మొత్తంలో మాఫీని కోరడం సహజమే. కానీ, ఏకంగా ఓ దేశ సార్వభౌమత్వాన్నే తనఖా పెట్టాలనడం ఆర్జెంటీనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫైజర్ రూపంలోని.. అమెరికా ఆధిపత్య దోరణిని పసిగట్టిన అర్జెంటీనా.. వ్యాక్సిన్ ఒప్పందం నుంచి వైదొలగింది.

ఇక, బ్రెజిల్ విషయానికి వద్దాం.. ఇక్కడ ఫైజర్ ఇంకో అడుగు ముందుకేసి.. గ్యారెంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని, ఆ డబ్బును ఏదైనా విదేశీ బ్యాంకులో జమ చేయాలని కోరింది. 2021 జనవరి 23న, ఫైజర్ తో ముందస్తు అగ్రిమెంట్ కు సంబంధించిన పలు నిబంధనలను ఉటంకిస్తూ.. బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఫైజర్ కంపెనీ బ్రెజిల్ ముందు పెట్టిన షరతులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. వ్యాక్సిన్ వల్ల భవిష్యత్తులో ఏదైనా జరగరానిది జరిగితే పూర్తి బాధ్యత బ్రెజిల్ ప్రభుత్వమే వహించాలట. ఫైజర్ కు అనుకూలంగా, అసవరమైతే విదేశాల్లో వున్న బ్రెజిల్ ఆస్తులపై సార్వభౌమత్వాన్ని వదులుకోవాలట. అంతేకాదు, డెలివరీ ఆలస్యమైనా జరిమానా విధించకూడదట. వ్యాక్సిన్ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలిగినా.. ఫైజర్ కు ఎలాంటి సంబంధం లేదట. బ్రెజిల్ లో ఫైజర్ పై కేసులు నమోదైనా.. అక్కడి ప్రభుత్వానిదే బాధ్యతట. ఇది ఎలా వుందంటే గాయానికి మందేస్తాను గానీ, ప్రాణానికి నా బాధ్యత లేదన్నట్టుంది. దీంతో జైర్ బొల్సోనారో ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. మీరూ వద్దూ.. మీ వ్యాక్సినూ వద్దూ.. అంటూ ఫైజర్ ఒప్పందానికి గుడ్ బై చెప్పింది బ్రెజిల్.

ఒక్క అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాలే కాదు,.. అమెరికా వ్యాక్సిన్ విషయ వలయంలో ఎన్నో దేశాలు చిక్కుకున్నాయి. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఇలా దేశాల అవసరాలను ఆసరాగా చేసుకుని.. ఓ ప్రాణాధార టీకాను అడ్డంపెట్టుకుని.. అమెరికా ఆటలాడుతోంది. దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు బైడెన్ ఆడుతున్న నాటకమిది.

అమెరికా జనాభా మహా అయితే 33 కోట్లకు మించదు. కానీ, అది ఇప్పటికే కొన్ని వందల కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేసి పెట్టుంది. వాక్సిన్ రీసెర్చ్ కోసమే ఏకంగా 9 బిలియన్ డార్లు ఖర్చుచేసింది. పైకి ప్రపంచ మానవాళి కోసమంటూ కలరింగ్ ఇచ్చినా.. పైసా విదిల్చకుండా ఒక్క వ్యాక్సిన్ చుక్క కూడా వదలడం లేదు. పేద దేశాలకు ఏర్పాటుచేసిన కొవాక్స్ కూటమికి సైతం ఒక్క డోసు కూడా సరఫరా చేయలేదు. పైగా వ్యాక్సిన్ తయారీకి నెలల ముందు నుంచే.. దేశాలకు గాలం వేయడం ప్రారంభించింది. టీకా డోసులతో టోకు వర్తకం ప్రారంభించింది. అమ్మకాలకోసం అధ్యక్షుడు బైడెన్ సైతం బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రోజు మాస్క్ తీసి మరీ మార్కెటింగ్ చేశారు. ఫైజర్ కు ప్రత్యామ్నాయం లేదని ప్రపంచానికి సందేశమిచ్చే ప్రయత్నం చేశారు.

పాలకులే కాదు.. బిలియనీర్లు సైతం ఓ చేయివేశారు. ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమెరికన్ వ్యాక్సిన్ వ్యాపారానికి అండదండలు అందించారు. మేధో హక్కుల చట్టంపై అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి ప్రపంచ దేశాలు ఛీకొట్టాయి. కొవిడ్ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర దేశాలతో పంచుకోవడాన్ని బిల్ గేట్స్ తప్పుబట్టారు. ఈ క్రమంలో భారత్ పైనా విషం కక్కారు. తమ కంపెనీలు ఎంతో నైపుణ్యంతో వ్యాక్సిన్లు తయారు చేస్తాయని.. అలాంటప్పుడు భారత్ తో మేథో హక్కులను ఎలా పంచుకుంటామని అన్నారు. ఈ ఘటనతో మానవత్వానికి మరో రూపంగా.. దాతృత్వంలో దానకర్ణుడిగా దర్శనమిచ్చే బిల్ గేట్స్.. తనది పక్కా బిజినెస్ మైండ్ నిరూపించారు.

ఇదిలావుంటే, వ్యాక్సిన్ బిజినెస్ లో భాగంగా అమెరికా,.. భారత్ పైనా కన్నేసింది. కానీ, బైడెన్ ఎత్తులకు మోదీ ప్రభుత్వం చిక్కలేదు. అమెరికా ఆధిపత్యానికి తలొగ్గకుండా దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. స్వదేశీయతకు పెద్దపీట వేసి.. దేశీయ టీకాల తయారీని ప్రోత్సహించారు. అందుకే, అతి తక్కువ సమయంలో అగ్రదేశాలకు దీటుగా వ్యాక్సిన్లు తయారు చేయగలింది భారత్. సొంత టీకాలతో దేశం స్వాభిమానంతో తలత్తుకునేలా చేశారు మోదీ. అంతేకాదు, పేదదేశాలకు చేయూతనిచ్చి ప్రపంచమంతా వసుదైక కుటుంబమని చాటిచెప్పారు. దీనిని అమెరికా జీర్ణించుకోలేకపోయింది. అందుకే, రెండో ఉధృతి అవకాశంగా మలుచుకుంది. భారత్ దయనీయమైన స్థితిలో కూరుకుపోయినా.. చేతనైనంత చేటు చేయాలనే చూసింది. ముడిసరుకుల దిగుమతులపై ఆంక్షలు విధించి.. వ్యాక్సిన్ల తయారీని దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. అయితే, మోదీ కౌంటర్ డిప్లొమసీతో దిగొచ్చిచ్చి సరఫరాను పునరుద్ధరించింది.

ఒకవేళ అమెరికాకు తలొగ్గి ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతులిస్తే ఏం జరిగేది..? వ్యాక్సిన్ల పేరుతో భారత్ పైనా అమెరికా ఆధిపత్యం చెలాయింది. బ్రెజిల్ అర్జెంటీనాల్లా మనమూ ఇబ్బందుల్లో పడేవాళ్లం. దురదృష్టం ఏమిటంటే.. ఇదే ఫైజర్ కు మనదేశంలో కావాల్సినంత ప్రచారం దొరికింది. మోదీ వ్యతిరేకులు, కుహనా లౌకికవాద జర్నలిస్టులు, విపక్ష పార్టీలతో.. అమెరికా బాగానే పబ్లిసిటీ చేయించింది. ది గ్రేట్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఫైజర్ కు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదంటూ నానా రభసా చేస్తున్నారు. ఈయన రాద్దాంతం వెనుక ఎవరి ప్రోద్భలం వుందో అర్థం చేసుకోలేనంత స్థితిలో దేశ ప్రజలు లేరు. ఇప్పటికీ ఆయన ఫైజర్ కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది. అందుకే, ఇప్పటికీ టీకా వేయించుకోకుండా వున్నారు. ఇక, ఫైజర్ పబ్లిసిటీలో భాగంగా యాంటీ మోదీ బ్యాచ్ స్వదేశీ టీకాలపై దుష్ప్రచారం చేశాయి. కొవాగ్జిన్, కొవీషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ లేనిపోని ప్రచారం చేశాయి. కానీ, వీటన్నింటిని అధిగమించి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

అమెరికా ఒత్తిడికి తలొగ్గి.. ఒకవేళ ఇప్పటికీ భారత్ వాక్సిన్ ఉత్పత్తి చేయకపోయి ఉంటే..? మోదీ స్వదేశీ వాక్సిన్ కోసం పట్టు పట్టక పోయి ఉంటే..? భారత్ కూడా ప్రపంచ ఫార్మా లాబీ విష వలయంలో చిక్కుకుని విలవిలలాడేది. కొవిడ్ వ్యాక్సిన్ పేరిట ఫైజర్, మొడెర్నా వంటి కంపెనీలు అందినకాడికి దోచుకునేవనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here