ప్రత్యేక మలబారు రాష్ట్రం కావాలట..!

0
1226

నిజం నిప్పులాంటిది..! ఇది కొందరికి నిష్ఠురంగా కనిపించవచ్చును.! మరికొందరికి బాధను…ఆందోళనను కలిగించవచ్చు! అయినా సత్యం చెప్పక తప్పదు! అదేంటో గుండెనిబ్బరం చేసుకుని వినండి! మన దేశ విభజన ఏ ప్రాతిపదిక జరిగిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొండి! ఆ విషాధ ఘటనలు ఇంకా మన కళ్ళముందు మెదులుతూనే ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు మళ్లీ దేశంలో అలాంటి పరిస్థితులే ఉత్పన్నం కాబోతున్నాయా? జాతి విచ్ఛిన్నకర శక్తులు…వేర్పాటువాద ఉద్యమాలతో దేశాన్ని ముక్కలు చెక్కలు చేయబోతున్నారా? అవును ఇది నిజం…!

కేరళలోని ముస్లింలు అత్యధికంగా నివసించే మలబారు ప్రాంతాన్ని ప్రత్యేక ముస్లిం స్టేట్ గా ఏర్పాటు చేయాలంటూ… కేరళలోని ఇస్లామిక్ మతోన్మాదమూకలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టాయి. సమస్త కేరళ సున్నీ స్టూడెంట్ ఫెడరేషన్-SKSSF ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకుని వచ్చింది.  ఈ స్టూడెంట్ వింగ్ ను ముస్లింలీగ్ అనుబంధ సంఘంగా పేర్కొంటారు. దీనిని 1989లో స్టార్ట్ చేశారు.  స్టూడెంట్ వింగ్ సత్యధార పేరుతో ఒక పత్రికను కూడా నడుపుతున్నారు. దీని ఎడిటర్ అయినా అన్వర్ సాదిక్ ఫైసీ….తన ఫేస్ బుక్ పోస్టులో కేరళ ఉత్తర జిల్లాలను కలుపుకుని ప్రత్యేక మలబారు స్టేట్ ను ఏర్పాటు చేయాలని, దీనికి కోజికోడ్ ను క్యాపిటల్ సిటీ చేయాలంటూ డిమాండ్ చేశాడు.

అంతేకాదు తెలంగాణ ఉద్యమం మాదిరిగానే కేరళలో సైతం త్వరలోనే ఉద్యమానికి రూపకల్పన చేస్తామని ఆ ఫోస్టులో చెప్పుకొచ్చాడు. తమ ప్రాంతాన్ని అటు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటములు పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. వరదల సమయంలోనూ, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలోను మలబారు ప్రాంతం వివక్షకు గురవుతోందంటూ నిప్పు రాజేస్తున్నారు. ఈ డిమాండ్ వెనుక ముస్లిం అతివాద సంఘాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × 4 =