More

  పోటీపడి మరీ పప్పులో కాలేశారుగా..!

  ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే.. అది అంతటితో అయిపోద్ది.. అదే లేనిది ఉన్నట్లుగా చూపించాలని చూస్తే ఉన్నది కాస్త ఊడిపోద్ది అని పెద్దల మాట. ఇది పాపం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి తెలియదేమో.. తన పెద్ద సారు మెప్పు పొందాలనుకుని బుట్ట బోర్లా పడ్డారు. ఆ వివరాలనే ఇప్పుడు చూద్దాం..

  పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాహుల్ గాంధీకి అబద్దాలు చెబుతూ కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం సోషల మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం, ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బుధవారం అక్కడ పర్యటించారు. సీఎం నారాయణ స్వామి సమక్షంలలోనే పుదుచ్చేరి ప్రజలను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సోలాయినగర్ ప్రాంతంలో మత్సకారులతో సమావేశమయ్యారు. ఐతే ఓ మహిళ మైకు అందుకొని సీఎం నారాయణస్వామి పనితీరుపై దుయ్యబట్టింది. ఇదిగో ఇలా..

  చూశారు కదా…

  తుఫాన్ సమయంలో మా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. సీఎం నారాయణ స్వామి కనీసం చూడడానికి కూడా రాలేదని ఆమె రాహుల్ గాంధీకి చెప్పింది. ఐతే రాహుల్‌కు తమిళ్ అర్ధం కాదు కాబట్టి ఆమె ఏం చెబుతోందని సీఎం నారాయణ స్వామిని అడిగారు. ఐతే సీఎంను తిడుతుందని చెబితే బాగోదని.. కవర్ చేసే ప్రయత్నం చేశారు నారాణయస్వామి. మహిళ విమర్శలను ప్రశంసలుగా పేర్కొంటూ అబద్ధం చెప్పారు. నివర్ తుఫాన్ సమయంలో తాను పర్యటించి.. అక్కడి ప్రజలకు ఆదుకున్నామని, ఆ విషయాన్నే ఆమె చెబుతోందని ప్లేట్ తిప్పి రాహుల్‌కు చెప్పారు నారాయణ స్వామి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఈ వీడియోపై బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పుదుచ్చేరి అబద్ధాల పర్యటనలో మరో అబద్ధం అంటూ ట్వీట్ చేశారు. ఓ వృద్ధురాలు తుఫాన్ సమయంలో తనకు ఎలాంటి సాయం అందలేదని ఫిర్యాదు చేస్తే.. అన్ని రకాలుగా సాయం చేశానని చెప్పిందని సీఎం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే…

  తమ పార్టీ ముఖ్యమంత్రే అంతపేరు వెనుకేసుకుంటే ఎలా అనుకున్నారో ఏమోకానీ

  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేశారు. బీజేపీ నాయకులు రాహుల్ ను ఎందుకు ‘పప్పు’ అని అంటారో మరోసారి తన అజ్ఞాన వ్యాఖ్యలతో రుజువు చేసుకున్నారు. పుదుచ్చేరి వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయనకు ఇటలీలోనే చెబితే అర్థమవుతుందని.. ఏకంగా కేంద్ర మంత్రులు సైతం రాహుల్ గాంధీని ఆటాడేసుకున్నారు.

  పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మత్స్యకారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు సంస్కరణలు రైతులకు వ్యతిరేకమని అన్నారు. ఈ దేశ భూమి పుత్రులకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నదని.. కానీ మత్స్యకారులకు మాత్రం మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. తదుపరి తాను పుదుచ్చేరికి వచ్చినప్పుడు మత్స్యకారులతో కలిసి బోటులో ప్రయాణిస్తానని.. వారి కష్టాలు తెలుసుకుంటానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ఏంటి నమ్మడం లేదా.. వీడియో చూడండి..

  కట్ చేస్తే… ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అయింది.. వెంటనే ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలు ఒక ఆట ఆడేసుకున్నారు..

  కేంద్రంలో మత్స్య రైతులకు మంత్రిత్వ శాఖ ఉన్నదని.. దానిని నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.

  అయితే ఈ ట్వీట్ ను ఆయన ఇటలీలో చేయడం గమనార్హం. వ్యవసాయ శాఖ పరిధిలోకే మత్స్యశాఖ వస్తుందని.. సోనియా పుట్టిన ఇటలీ లో కూడా మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని ఆయన ఎద్దేవా చేశారు.

  ఇక ఇదే ట్వీట్ ను మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా షేర్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు.

  అటు  నెటిజన్లు కూడా  రాహుల్ గాంధీని ట్రోల్ చేసి పడేస్తున్నారు.

  Trending Stories

  Related Stories