రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములను పరిరక్షించాలని రాష్ట్రీయ వానరసేన డిమాండ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏర్పాటు మీడియా సమావేశంలో వానరసేన నాయకులు మాట్లాడారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన పురుషోత్తమపట్నంలోని 917 ఎకరాల భూముల్లోని ఆక్రమణలు తొలగించేందుకు ఏపీ హైకోర్టులో పిల్ వేసినట్లు చెప్పారు. నవంబర్ 7న తాము దాఖలు చేసిన పిల్‌పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన మొదటి వాదనలోనే 917ఎకరాల భూములను స్వామివారికి చెందినవిగా గుర్తించిందన్నారు. ఆలయ భూములను సంరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని వెల్లడించారు. రాష్ట్రీయ వానరసేన సాధించిన విజయాన్ని భద్రాచల రాముడి సన్నిధిలో జరుపుకొవటానికి భద్రాచలం వచ్చినట్లు తెలిపారు. ఆలయ భూములన్నింటిని ప్రభుత్వం చేత సర్వే చేయించి ఆక్రమణలు తొలగించేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ వానరసేన జాతీయ అధ్యక్షులు నామ్ రామ్‌రెడ్డి, ఏపీ అధ్యక్షుడు మల్లిఖార్జునమూర్తి, గాయత్రి పీఠం పీఠాధిపతులు శ్రీ కాతేంద్ర స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.