నేపాల్ సుప్రీం సంచలన తీర్పు.. చిక్కుల్లో ప్రధాని కేపీ శర్మ ఓలీ

0
1188

పొరుగు దేశం… నేపాల్ లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. రద్దు చేయబడిన  పార్లమెంటులోని ప్రతినిధుల సభను ఆ దేశ సుప్రీం కోర్టు తిరిగి పునరుద్దరించింది.  గతేడాది డిసెంబర్ 20వ తేదీన నేపాల్ దిగువ సభను రద్దు చేస్తూ…, అలాగే ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించేలా తేదీలను ప్రకటిస్తూ… ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విపక్షాలు ఆ దేశ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో…. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. అంతేకాదు పునరుద్దరించినా దిగువసభను 13 రోజుల్లోగా సమావేశపర్చాలంటూ ఆదేశాలును సైతం జారీ చేసింది. నేపాల్ సుప్రీం తీర్పును ప్రచండతోపాటు… విపక్ష నేతలు అందరూ స్వాగతీంచారు.

అటు సుప్రీం తీర్పు నేపథ్యంలో నేపాల్ లోమళ్లీ రాజకీయ సందడి మొదలైంది. చైనాకు తొత్తుగా మారాడనే ఆరోపణలు రావడంతో.., ప్రధాని కేపీ శర్మ ఓలీని సొంత పార్టీ నేతలే గత కొంతకాలంగా నిలదీస్తూ వచ్చారు. అంతేకాదు ఆయన రాజీనామాకు సైతం పట్టుబట్టారు. దీంతో తన పదవిని కాపాడుకునే లక్ష్యంతోపాటు., పార్టీలో తన ప్రత్యర్థి అయినా పుష్పకమల్ దహల్ కు ఏ పదవి దక్కకూడదనే అక్కసుతో…, పావులు కదిపిన ప్రధాని కేపీ శర్మ ఓలీ… రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పార్లమెంటులో దిగువ సభను రద్దు చేయించారు. ఏప్రిల్ లో నిర్వహించే ఎన్నికల్లో… చైనా అందించే సహకారంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కేపీశర్మ ఓలీ ప్లాన్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

సుప్రీం తాజా తీర్పుపై కేపీ శర్మ ఓలీ ఇంత వరకు కూడా స్పందించలేదు. తన అనుచర వర్గంతో ఓలీ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటు ఓలీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీసుకురావనే తలంపుతో విపక్ష పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓలీ ప్రభుత్వం కుప్పకూలి రాజీనామా చేసిన తర్వాతే…స్పందిస్తామని కొంతమంది నేతలు చెబుతున్నారు.

నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నుంచి… కేపీ శర్మ ఓలీని ఇప్పటికే బహిష్కరిచామని ప్రచండ వర్గం చెబుతోంది. అయితే రెండు వర్గాలుగా విడిపోయిన నేపాల్  కమ్యూనిస్టు పార్టీ… ప్రచండకు చెందుంతా… లేక కేపీ శర్మ ఓలీకి చెందుతుందా అనే విషయంపై… ఆ దేశ ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

గతేడాది డిసెంబర్ 20న కేపీశర్మ ఓలీ పార్లమెంటు దిగువ సభను రద్దు చేసినప్పటి నుంచి కూడా… ఖఠ్మాండులో వరుస ర్యాలీలు… ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. సుప్రీం తీర్పు తర్వాత కూడా ఇవి ఆగేటట్టు కనిపించడం లేదని… ఇంకా మరికొన్ని రోజులపాటు కొనసాగుతూనే ఉంటాయని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

2017లో జరిగిన నేపాల్ పార్లమెంటులోని మొత్తం 275 స్థానాల్లో  ఓలీ పార్టీకి 125 సీట్లు, ప్రపంచ పార్టీకి  55 సీట్లు వచ్చాయి. ఇక నేపాల్ కాంగ్రెస్ కు 63 స్థానాలు వచ్చాయి. మాదేశీ పార్టీలకు పదుల సంఖ్యలో సీట్లు వచ్చాయి. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలిక నేపథ్యంలో… ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పుడు నేపాల్ కాంగ్రెస్, మాదేశీ పార్టీలు కీలకంగా మారాయి. ఇప్పుడు అందరి దృష్టి కేపీ శర్మ ఓలీ తీసుకునే నిర్ణయంపైనే ఉంది. మార్చి 8వ తేదీలో లోపు రాజీనామా చేస్తాడా? లేక సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటారా? జస్ట్…వెయిట్ అండ్ సీ.!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × five =