ఆమీర్ ఖాన్ నిజంగా అంత గొప్ప నటుడా..? అతడి నటనా కౌశలంతోనే ఆయన సినిమాలు హిట్టయ్యాయా..? కొన్నేళ్లు వెనక్కి వెళ్తే.. ఈ ప్రశ్నలకు సరైన జవాబు దొరుకుతుంది. ఆమీర్ ఖాన్ సినిమాలు హిట్ కావడానికి, అతడి యాక్టింగ్ కంటే కూడా.. తాను ఎంచుకున్న డైరెక్టర్లే కారణమంటే మీరు నమ్ముతారా..? కానీ, ఇది నిజం. సినీ విశ్లేషకులు ఢంకా భజాయించి చెబుతున్న వాస్తవం. ఈ విషయం తెలుసుకోవడానికి మనం రాకెట్ సైన్స్ ఏమీ చదవాల్సి పనిలేదు. విజయవంతమైన ఆమీర్ ఖాన్ సినిమాలను కాస్తా లోతుగా పరిశీలిన చేస్తే సరిపోతుంది.
ఆమీర్ ఖాన్ నటించిన మొదటి సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్లో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అంతగా హిట్ టాక్‌ను సంపాదించుకోలేకపోయాయి. 2000 సంత్సరంలో విడుదలైన ‘మేళా’ సినిమా భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ఆమీర్ ఖాన్ కెరీర్లోనే కాదు, బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమా కూడా ఇంతగా ఫ్లాప్ కాలేదు. దీంతో తన స్టార్ డమ్ హిట్లు తెచ్చిపెట్టదన్న నిగూఢ రహస్యాన్ని ఆమీర్ ఖాన్ గ్రహించాడు. ఎందుకంటే,.. తన నటననే ఆధారంగా చేసుకుని.. పేవలమైన కథాంశాన్ని ఎంచుకుని తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడ్డాయి. ఆమీర్ ఖాన్ స్టార్ డమ్ కూడా పనిచేయలేక భారీ డిజాస్టర్లను సంపాదించుకున్నాయి. వీటిసంఖ్య ఒకటో రెండో అనుకుంటే కూడా పొరపాటే,.. ఆమీర్ ఖాన్ సినిమాల్లో భారీ ప్లాపులను మూటగట్టుకున్నవి.. ఏకంగా 15 సినిమాల వరకు ఉన్నాయి. వీటితో పాటు యావరేజ్ టాక్‌ను సంపాదించుకున్న సినిమాలు కూడా ఎనిమిది ఉన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత ఆమీర్ ఖాన్ ఒక స్ట్రాటజీని అవలంభించాడు. దీని తర్వాత పేరొందిన డైరెక్టర్లతో తప్ప ఇతర డైరెక్టర్లతో చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పేరొందిన డైరెక్టర్లు సినిమా తీస్తే దానికి అంతగా ఫ్లాప్ లు వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ తక్కువ కలెక్షన్లు వచ్చినా.. అంతగా ప్లాప్ ను మూటగట్టుకునే అవకాశం లేకుండా కొద్దో గొప్పో హిట్ ను సంపాదించే అవకాశం ఉంటుంది. దీన్ని గ్రహించిన ఆమీర్ ఖాన్ ఈ కొత్త స్ట్రాటజీని అవలంభించారు. అశుతోష్ గవారికర్ అనే పేరొందిన డైరెక్టర్ తో లగాన్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా ఆమీర్ కి అనుకున్నంత హిట్ అందించకపోయినా.. కాస్తంత మంచి పేరునే సంపాదించి పెట్టింది. తర్వాత తీసిన ‘రంగ్ దే బసంతి’ సినిమా కూడా పూర్తిగా డైరెక్టర్ నైపుణ్యమే అని చెప్పుకోకతప్పదు. ఇక ఆమీర్ ఖాన్ జీవితంలో భారీ హిట్ ను సంపాదించిన సినిమాల్లో కూడా కథ ఆధారంగానే అంతటి హిట్ సంపాదించాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గజినీ, త్రీ ఇడియట్స్, పీకే సినిమాలన్నీ కథాంశం ఆధారంగానే హిట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాల్లో కథకు కాస్తంత ఆమీర్ ఖాన్ నటన కూడా తోడవడంతో పాటు ప్రతీ సినిమాను కాంట్రవర్సరీ కి కేరాఫ్ అడ్రస్ గా మార్చడంతో వాటికి మరింత ప్రచారం ఏర్పడింది. దీంతో సినిమాను ఎంటర్టైన్ మెంట్ కోసం చూడాలి అనుకునేవారి కంటే.. కాంట్రవర్సీ కోసమే చూసేవారి సంఖ్య ఎక్కువయ్యేది. ఈ విధంగా సినిమాలను ఎలా అమ్ముడుపోయేలా చేయాలనేది అమీర్ ఖాన్ కంటే గొప్పగా మరొకరికి తెలియదేమో. అయితే సమయం ఎప్పుడూ ఒక్కరికే అనుకూలంగా ఉండదు. ప్రతిఒక్కరికీ ప్రతికూల ప్రభావాన్ని చవిచూస్తుంది. తాజాగా ఆమీర్ ఖాన్ కూడా ఇటువంటి గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అయితే గతంలో ఎన్ని కాంట్రవర్సరీలు చేసినా సోషల్ మీడియా అంత బలంగా ఉండేది కాదు కాబట్టి తాము అనుకున్నట్లు నడిచేది. మీడియాకు డబ్బిచ్చి మానేజ్ చేసేవారు. తన సినిమా నచ్చకపోతే చూడకండని కండకావరంతో మాట్లాడినా దాన్ని అందంగా తీర్చిదిద్దే మీడియా వెనకుండేది. అయితే ఇది సోషల్ మీడియా యుగం అందునా డబ్బులకు లొంగని వారికి ఎక్కువగా ఆదరణ ఉండే కాలం కాబట్టి వీరి ఆటలు సాగటంలేదు. గతంలో చేసిన కాంట్రవర్శరీ మాటలు, దేశ వ్యతిరేక మాటలను తవ్వి తీస్తూ బాయ్ కాట్ ఆమీర్ ఖాన్ అని ప్రచారం చేయడంతో ఆమీర్ ఖాన్ మళ్ళీ బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడుతున్నారు. తాజాగా తీసిన లాల్ సింగ్ చద్దా సినిమాకు బాయ్ కాట్ ట్రెండ్ భారీగా తగలడంతో బొక్కబోర్లా పడింది. దీంతో మరో డైరెక్టర్ ఆమీర్‌తో సినిమా తీయడానికి సాహసించడంలేదు. అయితే తన పూర్వవైభవం మళ్ళీ సంపాదించుకోవడం కోసం మళ్ళీ పాత స్ట్రాటజీనే ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ నిపుణులు భావిస్తున్నారు.