దిశ రవి అరెస్టుపై స్పందించిన కేజ్రీవాల్

0
1200

ఢిల్లీ సీఎం…అరవింద్ కేజ్రీవాల్.! సోషల్ మీడియాలో ఎప్పుడు అలర్ట్ గా ఉంటాడు. వెంటనే స్పందిస్తాడు..! పైగా అతన్ని మోసే ఢిల్లీ లుటియెన్స్ మీడియా జర్నలిస్టలు అయితే.., అతని ప్రతి మూవ్ మెంట్ ను, డిసిషన్ ను సైతం అదో బ్రహ్మాండమైన వార్త అనే రేంజ్ లో కవర్ చేస్తారు. మరుసటి రోజు పేపర్లలో బాధ్యతగల సీఎం అంటూ హెడ్డింగులు.

అయితే అంతా బాగానే ఉంది. కానీ తాను పాలించే ఢిల్లీలో రింకూ శర్మ అనే 26 ఏళ్ళ యువకుడిని… ఇస్లామిక్ మతోన్మాదలు మూక దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేస్తే… కనీసం స్పందించేందుకు ఆయనకు తీరిక దొరకలేదు. ఈ విషాద సమయంలో…మృతుడు రింకూ శర్మ కుటుంబాన్ని పరామర్శించి, వారిలో ధైర్యాన్ని నింపే టైమ్…కేజ్రీవాల్ కు లేదు.

ఇక ఆమ్ ఆద్మీ నేతలైతే… రింకూ హత్యకు మేము బాధ్యులం కాదు…, అసలు ఢిల్లీ పోలీసు మా అండర్ లేదు…, సెంట్రల్ గవర్నమెంటు చేతుల్లో ఉందే అందుకు కేంద్రందే బాధ్యత అంటూ ఎదురుదాడికి దిగారు. లా అండ్ అర్డర్ కేంద్రం చేతుత్లో ఉన్నా…., ఇస్లామిక్ మతోన్మాదుల మూకదాడిలో చనిపోయింది మాత్రం ఢిల్లీ వాసే కదా…, అతని కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత సీఎం కేజ్రీవాల్ పై లేదా? ఎందుకు ఈ రాజకీయాలు.? రింకూ శర్మ హత్యలో అరెస్టైన నలుగురు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసినా కార్యకర్తలేనేనని అంటున్నారు. పైగా వారు ముస్లిం వర్గానికి చెందినవారు కావడంతోనే ఆయన సైలెంట్ అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడు కపిల్ శర్మ అయితే నేరుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైనే ఆరోపణలు గుప్పించాడు కూడా.  రింకూ శర్మ మర్డర్ కేసుపై కనీసం సోషల్ మీడియాలో సైతం స్పందించేందుకు చేతులు రానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్…, ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనలకు ప్లాన్ చేసిన టూల్ కిట్ వ్యవహారంలో అరెస్టు కాబడిన పర్యావరణ కార్యకర్త దిశరవిని అరెస్టు చేయడాన్ని మాత్రం ఖండించారు. దిశరవి అరెస్టును ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. 21 ఏళ్ల దిశ రవి అరెస్టు, భారత ప్రజాస్వామ్యంపై గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన దాడి. వ్యవసాయదారులకు మద్దతు పలకడం నేరం కాదు’’ అని కేజ్రీవాల్‌ ట్విట్ చేశాడు. కానీ రింకూ శర్మ మూక హత్యను కనీసం ఖండించలేకపోయాడు. 

కేంద్ర ప్రభుత్వం… రింకూ శర్మ మర్డర్ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేసింది. మరోవైపు… ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా… మూకదాడిలో మరణించిన రింకూ శర్మ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.  

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

sixteen − two =