More

  దిశారవికి మద్దతుగా ఆ ముగ్గురు..! పాకిస్తాన్ ప్రమేయం ఉందా..?

  స్కూల్ చదువును మధ్యలోనే ఆపేసి.. పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన స్వీడన్ కు చెందిన గ్రేటాథన్ బెర్గ్ టూల్ కిట్ కుట్రకు సంబంధించిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. నిందితులకు సంబంధించి ఉచ్చు కూడా బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పుడిప్పుడే అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లోని ఖలిస్తాన్ ఉగ్రవాదులతోపాటు.., మన స్వదేశంలోని సామాజిక, పర్యావరణ యాక్టివిస్టుల పేర్లు సైతం ఈ కేసుల బయటపడుతున్నాయి.

  బెంగళూరుకు చెందిన దిశారవిని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గ్రేటా థన్ బెర్గ్… సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్ లో కొన్ని మార్పులు చేసి… దిశారవి  మళ్లీ అప్ లోడ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ కోర్టు…, ఆమెకు ఐదు రోజుల పోలీసు కస్టడి విధించింది. పోలీసు విచారణలో మరికొంతమంది పేర్లు బయటకి వచ్చే అవకాశాలున్నాయని…,  ఆ తర్వాత దేశ వ్యాప్తంగా మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.

  టూల్ కిట్ డాక్యుమెంట్ లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేసినట్లు దిశారవి పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో దిశారవి కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఈ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఎన్జీవో గ్రేటా థన్ బెర్గ్ స్థాపించిన ఎన్జీవోకు అనుబంధంగానే భారత్ లో సైతం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

  ఈ ఫ్రైడే ఫ్యూచర్ అంటే…. విద్యార్థులు అందరూ కూడా…, ప్రతి శుక్రవారం స్కూల్ లేదా కాలేజ్ ఎగ్గొట్టి ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని వాతావరణ సమస్యల మీద ప్రశ్నించాలి? వారిని నిలదీస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించాలనేది ఈ ఎన్జీవో మెయిన్ లక్షం.!

  అయితే వాతావరణ…పర్యావరణ సమస్యలకు..ఈ ఖాలిస్తానీ ప్రేరేపిత ఉగ్ర సంస్థ నిర్వహిస్తున్న నకిలీ రైతు ఉద్యమానికి సంబంధం ఏమిటనే కోణంలోనూ విచారణ జరుగుతోంది.

  అయితే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే… భూజాలు తడుముకున్నట్లుగా… కొంతమంది సోకాల్డ్ రాజకీయ నాయకులు, ఇంకా ఎన్జీవో సంఘాల నేతలు…, లుటియెన్స్ జర్నలిస్టులు  అంతా…ఇప్పుడు దిశారవిని వెనుకేసుకువచ్చేందుకు పోటీలు పడుతున్నారు.

  ఇటు దిశారవికి మద్దతుగా కాంగ్రెస్, లెఫ్ట్, ఆమ్ ఆద్మీపార్టీయే కాదు… ఇప్పుడు పాకిస్తాన్ సైతం ముందుకు వచ్చింది. 21 ఏళ్ళ దిశారవిని అన్యాయంగా అరెస్టు చేశారని… ఇది ప్రజస్వామ్యానికి మంచిది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేయగా…, అక్రమ అరెస్టులతో ప్రభుత్వం ఉద్యమకారుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇక అన్నకు తోడుగా…ఆ వెంటనే ప్రియాంక వాద్రా గాంధీ కూడా ట్వీట్ చేశారు.  

  ఇక ఈ ముగ్గురు ట్వీట్ చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా స్పందించింది.భారత్ లో మోదీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహారిస్తోందని, ఉద్యమకారులను అరెస్టు చేసి అణిచివేస్తోందని…, వారికి కౌంటర్లు ఇచ్చేందుకు.., క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రెటీల చేత సిగ్గులేకుండా ట్వీట్లు చేయిస్తోందని, ఇప్పుడూ..టూల్ కిట్ కేసులో దిశారవిని సైతం అరెస్టు చేశారని…పాకిస్తాన్ ప్రభుత్వ ఏజెన్సీ పీటీఐ ట్వీట్ చేసింది.

  పాకిస్తాన్ ట్వీట్ చేయడం…అంతకు ముందు రాహుల్, ప్రియాంక, అరవింద్ కేజ్రీవాల్ సైతం దిశారవికి మద్దతుగా నిలువడం చూస్తుంటే…, ఏదో పెద్ద కుట్ర జరిగిందా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత వరకు కూడా అటు కాంగ్రెస్, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థల తీరును ఖండిస్తూ ట్వీట్ చేయకపోవడం.., పైగా అంతర్జాతీయంగా భారత్ గౌరవ ప్రతిష్ఠాలను దెబ్బతీసేవిధంగా వ్యవహారించిన టుల్ కిట్ కేసులో దిశారవికి మద్దతు తెలుపడం దేశ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి.!

  Trending Stories

  Related Stories