పార్లమెంట్ సభ్యుడు మోహన్ దేల్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్‌లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హోటల్ గదిలో గుజరాతీలో రాసిన లేఖ ఉన్నట్లు తెలుస్తోంది.
మోహన్ దాద్రా నగర్ హవేలీ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాద్రా నగర్ హవేలీకి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2019లో పార్టీని వీడారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి
ఆయన ఏడు సార్లు ఎంపీగా గెలుపొందారు. బీజేపీ, కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగిన ఆయన 2020లో జేడీయూలో చేరారు. 2019 సెప్టెంబర్ నుంచి.., పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
సిల్వస్సాలో ట్రేడ్ యూనియన్ లీడర్‌గా కెరీర్ ఆరంభించిన ఆయన.. 1989లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్
తరఫున పోటీ చేసి ఓటమిచెందారు. ఆ తర్వాత పార్టీని వీడిన ఆయన.. గత ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగి మళ్లీ విజయం సాధించారు. మో హన్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.