More

  త్వరలోనే బీజేపీలోకి మిథున్ దా..? టీఎంసీ గుండెల్లో గుబులు

  పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగాల్ ప్రజల్లో సూపర్ స్టార్ గా సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు..మిథున్ చక్రవర్తి త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే ప్రచారం అటు ఢిల్లీ, ఇటు బెంగాల్ మీడియాసర్కిళ్లల్లో ఊపందుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపిగా కొనసాగిన మిథున్ దా…,  ఆల్ ఆఫ్ సడన్ గా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారనే ఈ ప్రచారానికి…, ఆయన ఇంటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెళ్లడమే కారణమని కొంతమంది అయితే అప్పుడే ప్రచారం కూడా మొదలు పెట్టేశారు.

  నిజానికి ఆర్ఎస్ఎస్ లో ప్రజా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. భారత దేశ హితం కోరుతూ మన దేశ సంస్కృతిని సంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరిని, వారి వారి పార్టీలకతీతంగా…., ప్రతి రోజు వివిధ స్థాయిల్లో కలవడం సంఘ్ లో నిత్యకృత్యం.! అలాగే ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మాననీయ మోహన్ జీ భగవత్ సైతం పుర ప్రముఖులను కలడవం జరుగుతోంది. ఈ క్రమంలో… నటుడు మిథున్ చక్రవర్తిని ముంబైలోని ఆయన నివాసంలో మోహన్ జీ భగవత్ కలిశారు.

  మిథున్ చక్రవర్తి…కూడా 2019 అక్టోబర్ మాసంలో నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి.. సర్ సంఘ్ చాలక్ ను  కలిసివెళ్లడం జరిగింది. ఆ సమయంలో కూడా ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్తలు షికారు చేశాయి.

  మిథున్ చక్రవర్తికి… బెంగాల్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో కొంతకాలం ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ లో ఆయన సేవలకు గుర్తుగా… మమతా బెనర్జీ ఆయన్ను రాజసభ్యకు నామినెట్ చేసింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ… మిథున్ చక్రవర్తి…కొంతకాలం తర్వాత అనారోగ్య కారణలతో… 2016లో తృణమూల్ కాంగ్రెస్ కు, అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ప్రస్తతం అనేక టీవీ షోల్లో ఆయన ముఖ్యవ్యాఖ్యతగా…న్యాయనిర్ణేతగా వ్యవహారిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

  ఈ తరుణంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్…మిథున్ దా ఇంటికి వెళ్లడంతో…ఆయన మళ్లీ రాజకీయల్లో అడుగు పెడుతున్నారని…, త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.

  ఈ ఏడాది ఏప్రిల్ లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న మమతా బెనర్జీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ మిథున్ ను…కలవడం చేదువార్తేనని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

  2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 184 సీట్లు గెలచుకుని తొలిసారిగా మమతా సీఎం పీఠాన్ని అధిరోహించారు. అలాగే  2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  అయితే ఏకంగా 211 సీట్లు గెలుచుకుని.. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చారు.అయితే బెంగాల్ పై దృష్టి సారించిన బీజేపీ అధిష్ఠానం పక్కా ప్లాన్ ప్రకారం… బెంగాల్ లో తమ బలం పెంచుకుంటూ వచ్చింది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కు బీజేపీ గట్టి పోటీని ఇచ్చింది. తృణమూల్ కు దీటుగా సీట్ల సంఖ్యతోపాటు ఓట్ల శాతాన్ని సైతం గణనీయంగా పెంచుకుంది బీజేపీ.  2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 34 శాతం ఓట్లు వచ్చాయి. 2019 లోక్ సభ ఎన్నికలనాటికి ఇది 36 .5 శాతానికి పెరిగింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో  కేవలం రెండు సీట్లు సాధించిన కమలం పార్టీ…, 2019 లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి …, 18 సీట్లు గెలచుకుని తృణమూల్ కాంగ్రెస్ ను ఖంగుతినిపించింది. బీజేపీ దెబ్బకు ఆపార్టీ బలం 34 ఎంపీ సీట్ల నుంచి 22 సీట్లకు పడిపోయింది. వందేళ్ల కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్ల నుంచి రెండు సీట్లకు దిగజారిపోయింది. అలాగే దశాబ్దాలపాటు బెంగాల్ రాజకీయాలను శాసించిన లెఫ్ట్ పార్టీలు…. బెంగాల్ రాష్ట్రం నుంచి లెఫ్ట్ అయ్యాయి. 2014లో రెండు సీట్లు గెలుచుకున్న సీపీఎం పార్టీ…2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసీటును కూడా గెలుచుకోలేకపోయింది.

  2019 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు,  బీజేపీకి మధ్య పోలైన ఓట్లు….కేవలం రెండు శాతం మాత్రమే తేడా ఉందని…దీంతో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోన్న బీజేపీ…తనకు అందుబాటులో ఉన్న అస్త్రాలను వాడుకుంటోందని అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్…మిథున్ దాల కలియికకు ప్రాధాన్యం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.

  Trending Stories

  Related Stories