తుషార్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు: బండి సంజయ్

0
1061

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్పందించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ జబర్థస్త్ కామెడీ షో అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ట్వీట్ చేశారు. దీని నిర్మాత, డైరెక్టర్, రైటర్ కేసీఆరేనని సెటైర్లు వేశారు. ఫాంహౌజ్ డ్రామాలో నటించింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ట్వీట్ చేశారు. మీడియా పార్ట్ నర్ పింక్ మీడియా అంటూ బండి సంజయ్ పోస్ట్ పెట్టారు. ‘నిన్న కేసీఆర్‌ చూపించిన వీడియోల్లో ఏమీలేదు. ఫస్ట్‌ షో.. సెకండ్‌ షో అన్నాడు. చివరికి కామెడీ షో అ‍యింది. కేసీఆర్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్‌ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఇదంతా చేస్తున్నారు. లిక్కర్‌ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగొచ్చని అన్నారు బండి సంజయ్. ఈ ఎపిసోడ్‌ అంతా పెద్ద డ్రామా. ఫామ్‌హౌస్‌ స్క్రిప్ట్‌ అంతా ఢిల్లీలోనే తయారైంది. కేసీఆర్‌ ఢిల్లీ నుంచి రాగానే సీఎస్‌, డీజీపీని పిలిపించాడు. వాళ్లకు ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌ మొత్తం వివరించారు. ఫామ్‌హౌస్‌లో నేనింతే.. నా బతుకు ఇంతే అనే సినిమా తీశారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆ నలుగురు ఆణిముత్యాలను మాత్రం ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. ఈ ఎపిసోడ్‌లో డబ్బులు ఎక్కడా చూపించలేదు. 26న ఘటన జరిగితే.. సాక్షుల సంతకాలు 27న ఎలా తీసుకుంటారు?. ఇదంతా ప్లాన్‌ ప్రకారం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే నడిచింది. అమిత్‌షా పేరు చెప్పినంత మాత్రాన ఆయనతో సంబంధాలు ఉన్నట్లేనా? తుషార్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

nineteen − 10 =