తిరుపతి వేదికగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్..!

0
301

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జూన్ 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రభాస్‌ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనున్నారు. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతీసనన్‌ జానకిగా, లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకలో దాదాపు 200 మంది సింగర్స్‌, 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జియర్ స్వామి ముఖ్య అతిథిగా వస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జైశ్రీరామ్, రామ్ సీతా రామ్ పాటలు సినిమాకు విపరీతమైన హైప్ తెచ్చిపెట్టాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here