దాదాపు 40 ఏళ్లుగా ప్రపంచాన్ని బాధిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటివరకు మందుగానీ, వ్యాక్సిన్ గానీ కనిపెట్టలేదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, వైద్యరంగంలో ఎన్నో సాంకేతిక పద్ధతులు వచ్చినా ఇప్పటికీ హెచ్ఐవీకి మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అసలు మందులేని వ్యాధుల్లో ఎయిడ్స్ ప్రథమ స్థానంలో వుంది.
సరైన లైంగిక అవగాహన లేకపోవడం.. విచ్చలవిడి శృంగారం కారణంగా హెచ్ఐవీ సోకుతుందని.. అది ఎయిడ్స్ వ్యాధికి దారితీస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి హెచ్ఐవీ బారిన పడిన తర్వాత జీవితాంతం ఇక ఎయిడ్స్ తో బాధ పడాల్సిందే. అవగాహన లేని శృంగారం కారణంగా ఎంతోమంది హెచ్ఐవీ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే హెచ్ఐవీకి మందు కనుగొనేందుకు ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే మొన్నటికి మొన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఆవిష్కరించిన ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు.. ఇప్పుడు హెచ్ఐవీకి మందు కనుగొనేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పూర్తిస్థాయి హెచ్ఐవి టీకా కోసం ఇటీవలే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. HIVconsvx పేరిట ఇటీవలే ఒక వ్యాక్సిన్ తయారు చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇక దీనికి సంబంధించిన సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. హెచ్ఐవీ -1 వేరియంట్ లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్.. 18 నుండి 65 ఏళ్ల వయస్సు గల 13 మంది ఆరోగ్యకరమైన హెచ్ఐవీ నెగిటివ్ కలిగిన వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మొదటి డోసు ఇచ్చిన తర్వాత మళ్లీ నాలుగు వారాలకు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.
ఇక ఈ ప్రయోగాల్లో టీకా భద్రత రోగనిరోధకశక్తిని అంచనావేస్తున్నట్టు ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెచ్ఐవీ-నెగటివ్ వ్యక్తుల్లో హెచ్ఐవీతో సోకకుండా నిరోధించేందుకు కొత్త టీకా ట్రయల్ మొదటిదని.. ప్రధాన పరిశోధకుడు తోమాస్ హాంకే తెలిపారు. హెచ్ఐవీ వ్యాక్సిన్ అభ్యర్థుల్లో బీ-కణాల ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను ప్రేరేపించినట్టు గుర్తించామన్నారు. HIVconsvX రోగనిరోధక వ్యవస్థ శక్తివంతమైన, వ్యాధికారక నిర్మూలన టీ కణాలను ప్రేరేపిస్తుంది. హెచ్ఐవీ నుంచి రక్షణ దడంతోపాటు రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీల టీ సెల్ రెండింటి రక్షణ సామర్థ్యాన్ని వినియోగించుకోవడం చాలా ముఖ్యమని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ క్లినికల్ రీసెర్చ్ ఫెలో పావోలా సిక్కోని పేర్కొన్నారు.
ఇక, హెచ్ఐవీని నిరోధించేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇది ఎంతో కీలకమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు. ఏప్రిల్ 2022 నాటికి వ్యాక్సిన్ ట్రాయల్స్ పూర్తయి ఫలితాలను వెల్లడించేలా పరిశోధకులు టార్గెట్ పెట్టుకున్నారు. అంతేకాకుండా, యూరప్, ఆఫ్రికా, అమెరికాలో సైతం హెచ్ఐవీ వ్యాక్సిన్‌పై ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.