More

  ఖేల్ ఖతమైనా భలే కవర్ చేశాడు..! ఖాన్‎కు బాలీవుడ్ బైబై..!!

  అమీర్ ఖాన్ ఇటీవల తన సినిమాలు వరుస ఫ్లాప్ లను చవి చూడటంతో కొంతకాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసేశాడు. తాను సినిమాలకు దాదాపు ఏడాదిన్నర కాలం పాటు గ్యాప్ ఇస్తున్నట్లు తన అభిమానులకు చెప్పేశాడు. తన కుటుంబ సభ్యులతో సమయం గడపటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అమీర్ ఖాన్ తన కెరీర్ లో ఏడాదికి కనీసం ఒక్కసినిమాలో అయినా నటించేవాడు. ఎప్పుడో 2001 తర్వాత మూడేళ్ళ గ్యాప్ ఇస్తే,.. మళ్ళీ 2018 తర్వాత మరో మూడేళ్ళు గ్యాప్ ఇచ్చాడే తప్ప,.. తన సినీ కెరీర్ లో ఎక్కువగా గ్యాప్ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే అమీర్ ఖాన్ తాజా ప్రకటన వెనకున్న మర్మమేంటి..? నిజంగానే అమీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో గడపటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడా..? లేక తన కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడా..? అసలు అమీర్ ఖాన్ కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉండబోతోందనే దానిపై ఈ స్టోరీలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందుగా మన గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ అన్నింటినీ సబ్ స్క్రయిబ్ చేసుకుని.. జాతీయవాద మీడియాకు మరింత బలం చేకూర్చండి.

  ఇక స్టోరీలోకి వెళితే.. అమీర్ ఖాన్ కు బాలీవుడ్ లో మంచి పేరే ఉన్నా కూడా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు. బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో పెద్ద హీరో అంటే మినిమం బడ్జెట్ గ్యారంటీ అనే దీమా ఉంటుంది. కానీ అమీర్ ఖాన్ కు మాత్రం ఇది కూడా కలిసిరాకుండా భారీ డిజాస్టర్లను చవిచూస్తున్నాడు. 2016లో విడుదలైన దంగల్ తర్వాత తీసిన అన్ని సినిమాలూ ఫ్లాప్ టాక్ లనే మూటగట్టుకున్నాయి. 2016లో దంగల్ సినిమాకు భారత్ నుంచి 386 కోట్ల కలెక్షన్లు వస్తే ఒక్క చైనా నుంచే 1300 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏడాది తీసిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమా ఏదో అరకొర హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాతి ఏడాది వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ అనే సినిమా అయితే భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. దీంతో తప్పనిసరిగా సినీ కెరీర్ లో కాస్త గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే గ్యాప్ తర్వాత తీసిన సినిమాను ఆదరిస్తారనే భావనతో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తే అది కూడా తన కెరీర్ లో ఎన్నడూ లేనంతగా డిజాస్టర్ ను మిగిల్చింది. దీంతో అమీర్ ఖాన్ కు ఏం చేయాలో పాలుపోవడంలేదు. తన కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీలను చూసిన అమీర్ కు ఆల్ టైం డిజాస్టర్ లు వెనువెంటనే రావడంతో మరి కొన్ని రోజులూ గ్యాప్ తీసుకుని తిరిగొస్తే బావుంటుందేమో అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన కెరీర్ గ్యాప్ పై మాట్లాడిన అమీర్ ఖాన్ తనకు కుటుంబసభ్యులతో గడపడానికి తగిన సమయం దొరకటం లేదనీ,.. 35ఏళ్ళ సినీ జీవితంలో కుటుంబంతో గడిపిన సమయం చాలా తక్కువనీ,.. అందుకే తాను ఈ గ్యాప్ ను తీసుకుంటున్నానని ప్రకటించాడు.

  అయితే వీటికి కారణాలు బయటకెన్ని చెప్పినా కూడా లోలోపల కెరీర్ ముగిసిందనే భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో అంతా నెపోటిజంపైనే నడిచేది. ఇప్పుడున్న బాలీవుడ్ ఖాన్లకు ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అండ మెండుగా ఉండేది. బాలీవుడ్ సర్కిల్స్ లోని థియేటర్లన్నీ దావూద్ చేతిలో ఉండటంతో,.. నటీ నటులు కూడా ఎవరెవరు ఉండాలనేది ఖాన్ గ్యాంగే నిర్ణయించేది. అందుకే అప్పట్లో కొత్త సినీ నటులెవరూ అంతగా వచ్చేవారు కాదు. దీంతో ఖాన్ త్రయానికి వచ్చిన నటనతోనే సినిమాలు చేసినా కూడా అవి హిట్ అయ్యేవి. సినిమాల్లో ఏ విధమైన కొత్తదనం లేకపోయినా,.. దాదాపు అదే కాన్సెప్టులతో, దక్షిణాది సినిమాలను రీమేక్ చేసినా కూడా హిట్ అయ్యేవి. అయితే తర్వాతి కాలంలో బాలీవుడ్ లో ‘డీ’ గ్యాంగ్ ల ఆగడాలన్నీ అంతమైపోవడంతో ఖాన్ ల ప్రభావం కూడా తగ్గుతూ వచ్చింది. దీంతోపాటు అదే సమయంలో దక్షిణాది సినిమాలు పుంజుకోవడం మొదలైంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్, లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టడం మొదలైంది. అంతేకాదు, చిన్న చిన్న సినిమాలైన కాంతార, కార్తికేయ-2 లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా భారీ కలెక్షన్లను రాబట్టాయి. అయితే ఈ సినిమాలు విజయం సాధించడానికి పెద్ద స్టార్‎డమ్ ఇమేజ్ తో కాకుండా,.. ఈ సినిమాల్లో నటీనటుల నటన,కథాంశం వల్లనే హిట్టయ్యాయి. అందుకే చిన్న బడ్జెట్ తో తీసినా కూడా దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చాయి.

  అమీర్ ఖాన్ కూడా ఈ విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. తనకు తాను బాలీవుడ్ నెపోటిజం డైరెక్టర్లను నమ్ముకోకుండా కథను ఆధారంగా చూసుకుని సినిమాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ అమీర్ ఖాన్ ఇప్పుడు ఆ సాహసానికి పూనుకుంటాడా అన్నదీ అనుమానమే. 2000 సంవత్సరంలో వరుస ఫ్లాప్ ల తర్వాత చిన్న చిన్న డైరెక్టర్లతో సినిమాలను తీయకూడదనే నిర్ణయానికి వచ్చాడు. ఏ సినిమాను ఎంచుకున్నా కాస్తంత పేరున్న డైరెక్టర్లతో తీయడం వల్లనే ఇప్పటివరకు అన్నో ఇన్నో హిట్ లను సాధించాడు. ఇక 57 ఏళ్ళ వయసులో అమీర్ ఖాన్ కొత్త సాహసాలకు పూనుకునే అవకాశం దాదాపుగా ఉండదని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు. అందుకే సినీ యాక్టర్లందరూ పాటించే పాత పద్దతినే అమీర్ ఖాన్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎవరైనా హీరోలకు వరుస ఫ్లాప్ లు తగిలితే కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటారు. ఆ సమయంలో అభిమానుల్లో ఉండే కోపం చల్లారుతుంది. అంతేకాకుండా అప్పటివరకు తమ హీరో నుంచి సినిమాలు రాకపోవడంతో తర్వాతి సినిమాను ఖచ్చితంగా చూడాలనే ఉత్సుకత పెరిగి సినిమాను చూటానికి అభిమానులు వస్తారు. అయితే ఈ కిటుకు కూడా కొన్నిసార్లు సాధ్యపడదనే చెప్పాలి. 2018 తర్వాత అమీర్ ఖాన్ కెరీర్ లో భారీ గ్యాప్ తర్వాత నిర్మించిన లాల్ సింగ్ చద్దా సినిమా కెరీర్ లోనే ఎన్నడూ లేనంతగా డిజాస్టర్ ను మిగిల్చింది. దీంతో తాజాగా ఫ్యామిలీతో గడపడానికి ఏడాదిన్నర గ్యాప్ ఇస్తానంటూ ప్రకటించాడు. అయితే ఇప్పటికే అమీర్ ఖాన్ కుటుంబమంతా విచ్చిన్నమైపోయింది. మొదటి భార్య ‘రీనా దత్తా’ కు 2002లోనే విడాకులిచ్చేశాడు. వీరిద్దరికీ పుట్టిన ఇద్దరు పిల్లల్లో ‘ఇరా ఖాన్’ తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటోంది. అటు జునైద్ ఖాన్ కూడా తల్లి ‘రీనా దత్తా’తోనే ఉంటున్నాడు. ఇక రెండో భార్య అయిన ‘కిరణ్ రావ్’ కు కూడా గతేడాదే విడాకులిచ్చేశాడు. దీంతో పాటు అమీర్ ఖాన్ సోదరుడు కూడా అమీర్ కు కుటుంబంతో సన్నిహిత సంబంధాలేమీ లేవని చెప్పేశాడు. ఇక ఈ సమయంలో కుటుంబంతో గడపడానికి కూడా ఎవరూ లేని సమయంలో సినిమాలను సైతం ఆపాల్సిన పరిస్థితి ఏం వచ్చిందో అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గ్యాప్ తర్వాత తీసిన సినిమా కూడా హిట్ ను సాధించకపోతే అమీర్ ఖాన్ పూర్తిగా తన కెరీర్ ను ముగించే అవకాశం మెండుగా ఉందని పలువురు భావిస్తున్నారు.

  Trending Stories

  Related Stories