More

    కొత్తగూడెంలో అటవీసిబ్బంది భారీ ర్యాలీ

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు నిరసనగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది కొత్తగూడెంలో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. గొత్తి కోయలను అడవి నుంచి వెళ్ళగొట్టడంతో పాటు హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలెక్టరేట్‎లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. హత్యకు గురైన శ్రీనివాసరావు కుటుంబానికి రూ.5కోట్లు, శ్రీనివాసరావు భార్యకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ సిబ్బంది, అధికారులకు ఆయుధాలను ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆర్‎ఓ‎ఎఫ్‎ఆర్ సర్వే, గ్రామ సభలను బహిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్‎కు తమ డిమాండ్లు తెలిపారు.

    Trending Stories

    Related Stories