కేరళ సర్కార్‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. లవ్ జిహాద్ పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా మతమార్పిడులు జరుగుతుంటే.. పినరయి ప్రభుత్వం నిద్రపోతోందా..? అంటూ ప్రశ్నించారు. కాసర్గోడ్ జిల్లాలో నిర్వహించిన బీజేపీ ‘విజయ్ యాత్ర’ను లాంఛనంగా ప్రారంభించిన యోగి.. ఓవైపు యూపీలో తాము సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ.. మరోవైపు అధికార సీపీఎం, విపక్ష కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.
కేరళలో అధికార, విపక్ష పార్టీలు రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అధికార, విపక్ష పార్టీల నిర్లక్ష్యం వల్లనే.. రాష్ట్రంలో పెరుగుతున్న మతమార్పిడులకు యదేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ పై 2009లోనే నాటి రాష్ట్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చే కుట్రలో భాగమే ‘లవ్ జిహాద్’ అని.. నాడు కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. కానీ, ఇప్పటివరకు లవ్ జిహాద్ వ్యతిరేకంగా ఎలాంటి చట్టం తీసుకురాలేదన్నారు. యూపీలో మాత్రం లవ్ జిహాద్ వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. లవ్ జిహాద్ ను అరికట్టే విషయంలో కేరళ ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. కేరళలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం వుందన్నారు యోగి ఆదిత్యనాథ్. బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మతమార్పిడులకు అడ్డుకట్ట పడుతుందన్నారు.
ప్రస్తుతం యూపీ, మధ్యప్రదేశ్ తో పాటు మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ, కేరళలో లవ్ జిహాద్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నా.. పినరయి సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో లవ్ జిహాద్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కేరళ మరో పాకిస్తాన్ ను తలపిస్తోంది. పాకిస్తాన్ మాదిరిగానే కేరళలో కూడా యదేచ్ఛగా హిందువుల హక్కులను కాలరాస్తున్నారు. అక్కడ ప్రస్తుతం హిందూ అమ్మాయిలకు రక్షణలేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదేమో. అయినా, విష సంస్కృతిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కేవలం మైనార్టీ ఓటుబ్యాంకును కాపాడుకోవడం కోసమే.. అక్కడి హిందువులను హక్కులను పణంగా పెడుతున్నారన్న ఆరోపణులున్నాయి. అంతేకాదు, కేరళలో వేర్పాటువాద ఉద్యమాలు కూడా పురుడుపోసుకుంటున్నాయి. తమ ప్రాబల్యం ఎక్కువగా వున్న ప్రాంతాలను విడగొట్టి తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముస్లింలు కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు. ఇటీవలే మొదలైన ప్రత్యేక మలబార్ రాష్ట్ర ఉద్యమం ఇందుకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం మేల్కొని లవ్ జిహాద్ తో పాటు.. వేర్పాటువాద ఉద్యమాన్ని అడ్డుకోకపోతే.. కేరళ కూడా మరో పాకిస్తాన్ గా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. అది జరగకూడదంటే, మైనార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీలను అధికారానికి దూరంగా ఉంచడం ఒక్కటే మార్గమని రాజకీయ నిపుణులు చెబుతున్నమాట.