More

    ఐరాసకు భారత్ గిఫ్ట్.. ప్రపంచ దేశాల ప్రశంసల వెల్లువ

    గత కొద్ది నెలలుగా కరోనా పేరే కలవరిస్తూ కంగారు పడిన యావత్ దేశం నేడు భారత్ అందిస్తున్న వ్యాక్సిన్ లతో మళ్లీ ఊపిరిపోసుకుంటోంది. ఇవి వట్టి మాటలు కాదు.. ప్రపంచంలో ఏదో ఒక మూల నుంచి వి లవ్ ఇండియా.. థాంక్యూ ఇండియా అని వినిపిస్తున్న మాటలు దానికి సంబంధించిన వార్తలే దానికి నిదర్శనం.

    ఇప్పటికే.. కరోనా మహమ్మారిపై అంతర్జాతీయంగా జరుగుతున్న పోరులో భారత్‌ ఛాంపియన్‌గా నిలుస్తోంది. భారత్‌లో తయారైన కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లను ఓవైపు స్వదేశంలో ప్రజలకు పంపిణీ చేస్తూనే మరోవైపు భారత ఉపఖండంలోని దేశాలకు సైతం పంపుతోంది. ఇప్పుడు ఇదే క్రమంలో ఐక్యరాజ్యసమితికి కూడా వీటిని బహుమతిగా ఇవ్వాలని భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    ఐక్యరాజ్యసమితి తరఫున పలు దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు పనిచేస్తున్న బలగాలకు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని భారత్‌ నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారత్‌ చేసిన ఈ ప్రకటనపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

    ఫిబ్రవరి 17 2021 బుధవారం నాడు జరిగిన ఐరాస భద్రతామండలి ఓపెన్ డిబేట్‌లో పాల్గొన్న విదేశాంగమంత్రి జైశంకర్‌ ఈ ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నా ప్రపంచానికి సాధ్యమైనంత సహకరించాలన్న గతేడాది తీర్మానం మేరకు ఈ సాయం చేయదల్చుకున్నట్లు జైశంకర్ వెల్లడించారు.

    భారత్‌ ఇప్పటికే వ్యాక్సిన్ మైత్రీ, “Stop ‘Vaccine nationalism’ కార్యక్రమం కింద 25 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తోందని, ఇప్పుడు పలు దేశాల్లో క్లిష్టమైన పరిస్ధితుల్లో పనిచేస్తన్న శాంతిదళాలకు సైతం 2 లక్షల డోసులు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు విదేశాంగమంత్రి జైశంకర్ తెలిపారు. త్వరలో మరో 49 దేశాలకు సైతం తాము వ్యాక్సిన్‌ అందిస్తామని జై శంకర్‌ సగర్వంగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 వరకూ భారత్‌ తాము బహుమతిగా ఇవ్వదల్చుకున్న 167.7 లక్షల వ్యాక్సిన్లలో 62.7 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు జై శంకర్‌ తెలిపారు. మొత్తంగా ప్రపంచానికి అండగా నిలుస్తున్న భారత్ ను శత్రు దేశాలు సైతం ప్రశంసించేలా చేస్తున్నాయి అనే చెప్పాలి. ఈ ఒరవడి ఇప్పటిదే కాదు.. భారత్ కు ఉన్న సహజలక్షణమే అది. అందుకే ప్రధాని మోదీ వసుధైక కుటుంబకం అని ఏదేశమేగినా చెబుతుంటారు. సో మరికొంతకాలం కరోనాపై ఇలానే మనం నిలిచి గెలిస్తే పూర్వవైభవం తొందర్లేనే దక్కక మానదు.

    Trending Stories

    Related Stories