More

    ఐపీఎల్ ను పీఎస్ఎల్ దాటిందట.. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ పిచ్చి ప్రకటన..!

    గొప్పలు చెప్పుకోవాలి కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రేంజిలో మాత్రం చెప్పుకోకూడదనేది నిజం. తాజాగా ఆ బోర్డ్ చీఫ్ నజమ్ సేథి.. మన ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ సూపర్ హిట్ అని చెప్పుకొచ్చారు. పీఎస్ఎల్ 2023 ఇటీవలే ముగిసింది. లాహోర్ టైటిల్ ను గెలుచుకుంది.

    పీసీబీ చీఫ్ నజమ్ సేతి దీనిపై మాట్లాడుతూ.. పీఎస్ఎల్ ఈ ప్రపంచంలోనే గొప్ప లీగ్ అని చెప్పారు. డిజిటల్ రేటింగ్ ల్లో ఐపీఎల్ ను పీఎస్ఎల్ దాటి ముందుకు వెళ్లినట్టు నజమ్ సేథి అన్నారు. ఐపీఎల్ టీవీ రేటింగ్ లు 0.5గా ఉంటే, పీఎస్ఎల్ రేటింగ్ 11 కంటే ఎక్కువ అని అన్నారు. పీఎస్ఎల్ ను 15 కోట్లకు పైగా ప్రజలు డిజిటల్ మాధ్యమాల్లో చూడడం చాలా గొప్ప అని అన్నారు. ఇక అన్నీ తనకే తెలుసు అన్నట్లు ఐపీఎల్ ను డిజిటల్ గా చూసింది 13 కోట్లు మందే అని చెప్పడం మరింత హాస్యాస్పదం. ఇది పాకిస్థాన్ కు చాలా గొప్ప విజయం అని నజమ్ సేథి ప్రకటించేసుకున్నారు.

    లాహోర్ ఖలందర్స్ వరుసగా తమ రెండవ టైటిల్‌ను గెలుచుకుంది. 201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్‌ జ‌ట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. మొద‌ట లాహోర్ క్వాలండర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 ప‌రుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ అర్ధ సెంచరీ బాదగా.. కెప్టెన్‌ షాహీన్ అఫ్రిది 15 బంతుల్లో 44 పరుగులతో చేయ‌డంతో లాహోర్ భారీ స్కోరు న‌మోదు చేసింది. ఛేజింగ్ లో ముల్తాన్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.

    Trending Stories

    Related Stories