అర్థనగ్నంగా ఫోజులతో.. హిందువులను హర్ట్ చేసిన రిహనా

0
1210

వీరికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది? నిజానికి… హిందువులే తాము హిందువులమని మర్చిపోయారా? అందుకే… ఈ జాతివిచ్చిన్నకర శక్తులకు హిందువుల సెంటిమెంట్లను హార్ట్ చేయడమంటే భయం లేకుండా పోయిందా? హిందువుల సహనశీలతే…, ఈ విచ్ఛిన్నకర శక్తులకు ఆయుధంగా మారిందా? తమ బ్రాండ్లను, ఉత్పత్తులను మార్కెంటింగ్ చేసుకునేందుకు.., హిందువుల దేవీదేవతల విగ్రహాలను, చిహ్నాలను సైతం అగౌరపరుస్తుంటే… హిందూ సమాజం చూస్తు ఊరుకోవాలా?

విషయంలోకి రాకుండా…, ఏమిటీ ప్రశ్నలు అని మీరునుకుంటున్నారా.! అక్కడికే వస్తున్నా…! కొన్ని వార్తలు చూస్తుంటే మనస్సులో బాధ…కోపం వస్తున్నాయి! మనకు మాత్రమే ఎందుకిలా జరుగుతోందనిపిస్తోంది. ఎక్కడో ఏదో లోపముంది? మనల్ని మనమే మర్చిపోయేలా మన మైండ్ సెట్ నే మార్చేశారా? మనకు తెలియకుండానే..,  దేశంలో తిష్టవేసిన యాంటి నేషనల్ ఎలిమెంట్స్ వేసిన ఉచ్చులో…, మనం చిక్కుకుపోయామా? వారు చెప్పిన కట్టుకథలు.., సిద్ధాంతాలు, గతితార్కిక భౌతికవాదం…, పర్యావరణవాదం..వేర్పాటువాదం, ఉగ్రవాదం, కమ్యూనిజం.. ఇంకా భారత్ తేరా తుక్డే తుక్డే హోగా అంటూ ఈ నిరసనలు ఏమిటీ?

తాజాగా రైతుల పేరుతో జరుగుతున్న ఈ ఉద్యమంతో వీరందరికీ ముఖ్యంగా ఖలిస్తాన్ వేర్పాటువాదులకు, పర్యావరణవాదులకు, సోకాల్డ్ లుటియెన్స్ మీడియా జర్నలిస్టులకున్న సంబంధం ఏమిటీ? దేశ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.!

దేశంలో రైతుల పేరుతో జరుగుతున్న ఉద్యమానికి… అమెరికా పాప్ సింగర్ రిహానా మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ ట్విట్ చేసినందుకు గాను…, సిక్కు ఖలిస్తాన్ వేర్పాటువాదుల నుంచి ఆమెకు భారీ మొత్తంలో సొమ్ము కూడా ముట్టినట్లు వార్తలు వచ్చాయి.

డబ్బు కోసం… ఎంత వరకైనా వెళ్లే కల్చర్ మనది కాదు. మన దేశంలో ప్రతిదాన్ని డబ్బు అనే కోణంలో చూడం.! మనకంటూ కొన్ని ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి. కానీ పాశ్చాత్య దేశాల్లో అలా కాదు…, ప్రతిదాంట్లో మనీ మేకింగ్ ఎలా అనే మైండ్ సెట్ తోనే ఉంటారు.

అందుకే కాబోలు…, పాప్ సింగర్ రిహానా ఛీప్ ట్రిక్ ను ప్లే చేసిందా? తాజాగా రిహానా చేసిన ట్వీట్ లో వినాయకుడి లాకెట్ ను వేసుకుని…తన ఓన్ బ్రాండింగ్  లోదుస్తుల పబ్లిసిటీ స్టంట్ చేసింది. అంతేకాదు ఆ ట్వీట్ లో నడుము వరకు దుస్తులేకుండా…రిహానా ఉంది.  పైగా మెడలో మాత్రం… వినాయకుడి లాకెట్ ను వేసుకుని…ఫోటోలకు పోజులిచ్చింది. ఇదే తరహాలో ఇస్లామ్, క్రైస్తవ మతాలకు సంబంధించిన చిహ్నాలను ధరించే ధైర్యం ఆమె ఎందుకు చేయలేకపోయింది.?  కారణం సింపుల్ హిందువులు సంఘటితంగా లేకపోవడమే.!

కొంతమంది నెటిజన్లు మాత్రం రిహానా చేసిన ట్విట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా సెంటిమెంట్లను హార్ట్ చేయడమేని మండిపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో కూడా మన సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు, కుహానా సెక్యులర్ వాదులు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇంకా ప్రాంతీయవాద..వేర్పాటువాద కుటుంబ పార్టీల నాయకులు…వారి అనుచరులు రిహానాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వీరిని మనం ఎలా  అర్థం చేసుకోవాలో చరిత్రలోని కొన్ని ఘట్టాలను తిరగేస్తే…రాజా జయచంద్రుడు, మీర్ జాఫర్లు గుర్తుకు వస్తారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

19 − 14 =