అజిత్ దోవల్ నివాసం, ఆఫీసుపై పాక్ ఉగ్రవాదుల రెక్కీ

0
1173

అవును ఇది నిప్పులాంటి నిజం…!  ఇండియాస్ రహస్య గూఢచారి…, ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న అజిత్ దోవల్ ను హత్య చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు చేస్తోందా ? ఆయన్ను హతమార్చేందుకు పాక్ ప్రేరిత ఇస్లామిక్ ఉగ్రవాదులు రెక్కిని సైతం నిర్వహించారా? అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల అరెస్టైన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాది హిదాయతుల్లా మాలిక్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ కార్యలయంలోపాటు ఆయన నివాసం వద్ద భద్రతను పెంచారు.

జమ్మూకశ్మీర్… షోపియాన్ కు చెందిన మాలిక్ అనే ఉగ్రవాదిని ఈ నెల 6న ఒక వాహనంలో ఆయుధాలను తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసునకు సంబంధించి మాలిక్ భార్యతోపాటు బీహార్ కు చెందిన ఓ వ్యక్తిని అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత వారు చెప్పిన సమాధానాలను క్రాస్ చేసుకున్న పోలీసులు మరోసారి మాలిక్ ను ప్రశ్నించగా… అసలు విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది. 2019 మే 24వ తేదీన శ్రీనగర్ నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చిన మాలిక్., మే 25న ఢిల్లీలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను వీడియో తీసినట్లు…, ఇందులో దోవల్ ఆఫీసు కూడా ఉన్నట్లు విచారణలో తెలిపాడు. ఈ వీడియోలను వాట్సాప్ ద్వారా… పాకిస్తాన్ కు చెందిన డాక్టర్ అనే వ్యక్తికి పంపినట్లు మాలిక్ చెప్పాడు.

అటు…2019లో పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉండి అరెస్టైన ఉగ్రవాది సమీర్‌ అహ్మద్‌ దార్‌తో కలిసి సాంబా సెక్టర్‌లోని సరిహద్దు ప్రాంత్రాన్ని కూడా వీడియో తీసినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసుల ఇంటరాగేషన్‌లో మాలిక్‌ వెల్లడించాడు. 2020 మేలో జరిగిన ఆత్మహుతి దాడి కోసం కారును ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. అలాగే మరో ముగ్గురు జైష్ ఉగ్రవాదులు ఇర్ఫాన్ తోకర్, ఉమర్ ముష్తాక్, రాయీస్ ముస్తఫాతో కలిసి 2020 నవంబర్‌లో షోపియన్‌లోని జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌కు చెందిన నగదు వ్యాన్ నుంచి రూ.60 లక్షలను దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు.

2019లో పీవోకేలోని ఉగ్ర స్థావరాలున్న బాలాకోట్‌పై భారత వాయుసేన మెరుపుదాడుల అనంతరం… పాకిస్థాన్ ఐఎస్ఐ…అజిత్‌ దోవల్‌ పేరును  ఉగ్రవాదుల హిట్‌ లిస్ట్‌లో చేర్చిందని చెబుతున్నారు.

నిజానికి… పాకిస్తాన్ సైన్యానికి, అక్కడి పాలకులకు, ఇంకా ఐఎస్ఐ… ఇస్లామిక్ ఉగ్రవాదులకు అజిత్ దోవల్ పేరు వింటేనే వణికిపోతారని… స్వయంగా పాక్ రాజకీయ నేతలే పేర్కొన్నారు. పాకిస్తాన్ లో ఏడేళ్ళు రహస్య గూఢాచారిగా జీవితం గడిపిన దోవల్ కు అక్కడి పొలిటికల్ పార్టీలతోపాటు, పాక్ సైన్యంలోనూ ఏజెంట్లు ఉన్నారనే ప్రచారం ఉంది. దోవల్ సేవలను సరిగా వినియోగించుకోవడలో కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం…ఘోరంగా విఫలమైందనే  విమర్శలు ఉన్నాయి. 2014లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత… అజిత్ దోవల్ ను  పీఎం మోదీ మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఆయన్ను జాతీయ భద్రత సలహాదారుగా నియమించారు. ఇక అప్పటి నుంచే పాకిస్తాన్ పాలకుల వెన్నులో వణుకు మొదలైంది. పాకిస్తాన్ పై జరిపిన సర్జిల్ స్ట్రయిక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో భద్రత పర్యవేక్షణకు అజిత్ దోవల్ స్వయంగా నేతృత్వం వహించారు. దోవల్ కు పాకిస్తాన్ లోని బాల్టిస్తాన్, వజీరిస్తాన్, పీవోకే, బెలూచిస్తాన్, సింధ్ ప్రాంతాల్లో దోవల్ కు విస్తృతమైన నెట్ వర్క్ ఉందని అంటారు. భారత్ జోలికి పాకిస్తాన్ వస్తే… దాన్ని ముక్కలు చేసేందుకు దోవల్ ప్రత్యేక కార్యచరణను సైతం రూపొందించారని అంటారు. ఈ విషయాన్ని ఒక సందర్భంలో అజిత్  దోవల్ స్వయంగా బయటపెట్టాడు కూడా.!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here